మంచినీటి కుళాయిల్లో గోవా టాప్..
Ens Balu
2
Gova
2020-10-10 13:03:29
దేశంలో ఇంటింటికీ త్రాగునీరు అందించిన మొదటి రాష్ట్రంగా గోవా తన ప్రత్యేకతను చాటుకుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు. దాదాపు 12.30 లక్షల ఇళ్ళకు పైపులు ద్వారా త్రాగు నీరందించే పథకాన్ని విజయవంతంగా అమలు చేసినట్టు సీఎం పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ వలన కలిగే లాభాలను ఇంటింటికీ తీసుకువెళుతూ గ్రామీణ ప్రాంతాల్లో జీవితం సుఖమయం చేయటానికి ఇది ఉపయోగపడిందని అంకిత భావంతో కూడిన కృషి తగిన ఫలితాల నిచ్చిందిని పేర్కొన్నారు. 2020 జూన్ లో కేంద్ర జలశక్తి శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గోవా ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ, రాష్ట్ర వార్షిక కార్యాచరణ కింద గ్రామీణ ప్రాంతాల్లో 100శాతం ఇళ్ళకు నీటి కనెక్షన్లు ఇవ్వటాన్ని అభినందించారు. ఈ పథకానికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగానే గోవాకు 2020-21 సంవత్సరానికి గాను నిధుల కేటాయింపును రూ.12.49 కోట్లకు పెంచామన్నారు. వివిధ కేంద్ర ప్రభుత్వాల పథకాలను సమీకృతం చేయటం ద్వారా లబ్ధి పొందవచ్చునని సూచించారు. గ్రామీణ ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులు, జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధి, సి ఎస్ ఆర్ నిధులు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి తదితరాలు కలుపుకోవటం ద్వారా లబ్ధిపొందాలన్నారు. దీనివలన త్రాగునీటి వనరులను పటిష్టం చేయవచ్చునన్నారు.