కలెక్టర్ సమక్షంలో ఆ అమ్మాయి కలెక్టర్ అయ్యింది..


Ens Balu
0
కలెక్టర్ కార్యాలయం
2020-10-11 12:26:01

అనంతపురం జిల్లాకి ఆయన కలెక్టర్ కానీ.. అక్టోబరు 11 ప్రపంచ బాలికల దినోత్సవం రోజును పురస్కరించుకొని కొత్తగా ఆయన మరో కలెక్టర్ ను తయారు చేశారు.. దగ్గరుండి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడానికి ఆయన మార్గదర్శి అయ్యారు.. ఆ చారిత్రక అవకాశం జిల్లాలోని ఇంర్మీడియట్ చదువుతున్న ఎం.శ్రావణిని వరించింది. ఆ అమ్మాయి ఒక్కరోజు కలెక్టర్ గా పనిచేయడానికి ఆ జిల్లా కలెక్టర్ కర్త, కర్మ, క్రియ, అయ్యారు. ఆ అమ్మాయి తన జీవితంలో ఓ ఉన్నత లక్ష్యాన్ని ఎన్నోకోవడానికి కలెక్టర్ గంధం చంద్రుడు చేసిన వినూత్న కార్యక్రమం పలువు విద్యార్ధులను కలెక్టరు, జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శిలను చేసింది. ఒక ఐఏఎస్ అధికారి ఆలోచన సరళి ఎంత స్పూర్తిదాయంకంగా వుంటుందో అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుని చూస్తే అర్ధమయ్యే దేశానికే వివరించి చూపారాయన.. ఐఏఎస్ ల గౌరవాన్ని అమాంతం పెంచే విధంగా విద్యార్ధుల్లో ఉన్నత లక్ష్యాలకు బాటలు వేసుకునేలా చేసిన కార్యక్రమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇక కలెక్టర్ గా బాధ్యలతు చేపట్టిన శ్రావణి ఆనందానికి అవధులు లేవు. కలెక్టర్ సార్ తన జీవితంలో మరుపురాని అవకాశం కల్పించారని, తాను మంచి చదువులు చదివి ఖచ్చితంగా కలెక్టర్ అవుతానని చెప్పింది. అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున తనకు వచ్చిన అవకాశం జీవిత లక్ష్యానికి తొలిమెట్టుగా భావించి, తాను కూడా ఐఏఎస్ అయి ప్రజలకు నిశ్వార్ధ సేవలు చేస్తానని కలెక్టర్ కు వివరించింది శ్రావణి. కొత్తగా ఒక రోజు కలెక్టర్ గా చేసిన అమ్మాయికి, నిజంగా ఒక కలెక్టర్ అయివుండి కూడా విధులు స్వీకరించే టపుడు అధికారులు ఏ విధమైన గౌరవ మర్యాదలు చేస్తారో ఒక్కటి కూడా పొల్లుపోకుండా ఆ అమ్మాయిని కూడా అదేవిధంగా కలెక్టర్ గంధం చంద్రుడు కలెక్టరేట్ వద్ద రిసీవ్ చేసుకొని, ఆమెను కలెక్టర్ చాంబర్ వరకూ తీసుకొని వచ్చి, కలెక్టర్ చైర్ లో కూర్చోబెట్టి, ఆమెను ఒక్కరోజు కలెక్టర్ ను చేయడంతోపాటు, ఆమె మనుసులో ఏ విధమైన ఆలోచనలు ఉన్నాయో వాటిని వివిధ శాఖల అధికారులును ఆదేశించాలా చేశాయి. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో బాధిత బాలికకు రూ.25 వేలు పరిహారం అందించే ఫైల్ పై సంతకం చేసిన ఒక రోజు కలెక్టర్ శ్రావణి సంతకం చేయడం విశేషం. రాత్రి 8 గంటల తర్వాత ఉదయం 8 గంటలకు ముందు మహిళా ఉద్యోగులను అధికారిక పనుల గురించి  ఫోన్ లు చేసి ఆటంకం కలిగించకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ఫైల్ పై కూడా సంతకం చేశారు ఒక్కరోజు కలెక్టర్.. ఆ తరువాత కలెక్టర్ హోదాలో ఆ విద్యార్ధిని మీడియాతో కూడా మాట్లారు. ఆ విషయాన్ని అన్ని మీడియాలు ప్రముఖంగా చూపించాయి. అందులో ముఖ్యంగా అందరికంటే ముందుగా ఈరోజు న్యూస్ సర్వీస్ కిచెందిన అధికారి  ఈఎన్ఎస్ లైవ్ న్యూస్ యాప్ ప్రపంచానికి తెలియజేసింది. నిజంగా కలెక్టర్ అయిన ఆయన కూడా ఒక సాధారణ ఉద్యోగిలా పక్కన నిలుచొని మరీ ఈ కార్యక్రమాలు చేపట్టడం గంధం చంద్రుడి యొక్క స్పూర్తిదాయకమైన ఆలోచనకు ప్రతీ ఒక్కరూ సలామ్ చేశారు..! దటీజ్ గంధం చంద్రుడు ఐఏఎస్, అనంతపురం జిల్లా కలెక్టర్..!