విశాఖలో కొట్టుకుపోయిన భారీ నౌక..
Ens Balu
1
విశాఖ పోర్టు ఏరియా
2020-10-13 09:24:49
విశాఖ బంగాళాఖతంలో బంగ్లాదేశ్ కి చెందిన ఒక భారీ(M.V.MAA) ఓడ అలల ఉద్రుతికి నిన్నరాత్రి కొట్టుకుపోయింది. ఏకంగా 80 మీటర్ల రెండు లంగుర్లు తెగిపోవడంతో అలల దాటిని ఈ భారీఓడ కొట్టుకుపోయిందని సమాచారం. దీనిని భారత కోస్టుగార్డ్ కూడా గుర్తించింది. పోర్టుకి ఉత్తర దిక్కున వున్న సముద్రంతో ఇది గల్లంతు అయ్యిందని చెబుతున్నారు. సహాయక చర్యల కోసం కోస్టుగార్డుని సంప్రదించినట్టు ఓడ నిర్వాహకులు తెలియజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో సముద్రంలోని అలల ఉద్రుతి చాలా అధికంగా రావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సముద్రతీర ప్రాంతంలో ప్రస్తుతం దీనిని సేఫ్ గా తీసుకు రావడానికి కోస్టు గార్డు రంగంలోకి దిగింది. ఒడ్డుకు బాగా దగ్గరగా వచ్చేసిన నౌకను సముద్ర మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి...