దూరప్రాంతాలకు ntpc ఫ్లైయాష్..


Ens Balu
2
ఎన్టీపీపీ
2020-10-14 21:04:36

దేశ‌వ్యాప్తంగా దూర‌ప్రాంతాల‌కు ఫ్టైయాష్‌ను ర‌వాణా చేయ‌నున్న ఎన్‌.టి.పి.సి ప్రకటించింది.  ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుద‌ల చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్‌టిసపిసి రిహాండ్ విద్యుదుత్ప‌త్తి ప్లాంటు కండిష‌న్డ్ ఫ్లైయాష్‌ను సిమెంట్ త‌యారీదారుల‌కు పంపిన తొలి విద్యుద‌త్ప‌త్తి ప్లాంటుగా నమోదైంది. ఈ ప్లాంటు ఇటీవ‌ల 3,834 మెట్రిక్ ట‌న్నుల కండిష‌న్డ్ ఫ్లైయాష్‌ను 59 బాక్స‌న్ వాగ‌న్ల‌లో  అస్సాంలోని నాగ‌న్ లోగ‌ల దాల్మియా సిమెంట్ (భార‌త్‌)లిమిటెడ్‌కు పంపినట్టు సంస్థ పేర్కొంది. అంత‌కుముందు కండిష‌న్డ్‌ఫ్లై యాష్‌రైల్ రేక్‌ల‌ను టికారియా(యూపి),మ‌ధ్య‌ప్ర‌దేశ్లోని కిమోర్‌,పంజాబ్‌లోని రోపార్‌ల‌లోని ఎసిసి కంపెనీ ప్లాంట్ల‌కు పంపింది. 2019-20 ఆర్ధిక సంవ‌త్స‌రంలో దాదాపు 44.33 మిలియ‌న్‌ట‌న్నుల ఫ్లైయాష్‌ను వివిధ ఉత్ప‌త్తుల త‌యారీలో ఉప‌యోగించారు. ఎన్‌.టి.పిసి ప్లాంట్ల‌లో ఏటా సుమారు 65 మిలియ‌న్‌ట‌న్న‌ల బూడిద వ‌స్తుంది. ఇందులో 80 శాతం అంటే సుమారు52 మిలియ‌న్ ట‌న్నులు ఫ్లైయాష్‌. ప్ర‌స్తుతం మొత్తం బూడిద‌లో 73 శాతాన్ని సిమెంట్ ఉత్ప‌త్తిలో ఉప‌యోగిస్తున్నారు. అలాగే ఫ్లైయాష్ ఇటుక‌‌లత‌యారీ,రోడ్డు క‌ట్ట‌ల నిర్మాణం, గ‌నుల‌ను పూడ్చ‌డానికి,లోత‌ట్టు ప్రాంతాల అభివృద్ధికి వినియోగిస్తున్నారు.