తలనరికి ప్రియుడి ఇంటిముందు వేసిన భర్త..


Ens Balu
2
Anantasagar
2020-10-15 13:16:06

తెలుగు సినిమాల్లో హర్రర్ సీన్లు, వివాహేతర సంబంధాలను తలపించే విధంగా నిజజీవితంలో కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కోపంతో ఆమెను భర్త దారుణంగా హత్య చేశాడు.  జిల్లాలోని నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ కు చెందిన గొల్ల అనసూజ,సాయిలు భార్యభర్తలు. అనసూయకు నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన జైపాల్ రెడ్డితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొంతకాలం గుట్టుచప్పుడుగా సాగిన వ్యవహారం భర్త సాయిలుకు తెలియడంతో కథపూర్తిగా అడ్డం తిరిగింది. ఇదే విషయమై బుధవారం రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అనంతరం తీవ్ర కోపోద్రిక్తుడైన సాయిలు అనసూయ తల నరికేశాడు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేసి నారాయణఖేడ్ లోని ప్రియుడు జైపాల్ రెడ్డి ఇంటి ముందు వేశాడు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. భర్తను కాదని ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంటే పరిణాలు ఇంత తీవ్రంగా ఉంటాయాని చర్చించుకునే విధంగా జరిగిన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. అనంతరం  సాయిలు నారాయణఖేడ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.