టీవోటీ మూడో దశకు రూ.5,011 కోట్ల విడుదల..
Ens Balu
2
New Delhi
2020-10-20 12:38:53
ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్, తమిళనాడులో 9 టోల్ కేంద్రాలున్న టీవోటీ (టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) మూడో దశ (566 కి.మీ.)కు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అనుమతినిచ్చిందని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఈ మేరకు సహాయ మంత్రి వి.కె.సింగ్, ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్ ఎస్.ఎస్.సంధు, హెన్‌హెచ్‌ఏఐ, క్యూబ్ హైవేస్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గట్కరీ మాట్లాడు, సంస్థ క్యూబ్ మొబిలిటీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ (క్యూబ్ హైవేస్)కు ఈ ప్రాజెక్టును అప్పగించిందన్న మంత్రి ఇందుకుగాను, రూ.5011 కోట్లను ముందస్తుగా పొందిందని వివరించారు. ప్రస్తుత ప్రాజెక్టు రాయితీ కాలం 30 ఏళ్లు. ఈ వ్యవధిలో టోల్ కార్యకలాపాలు, నిర్వహణ, వసూళ్లను క్యూబ్ హైవేస్ చేపడుతుంన్నారు. టీవోటీ పద్ధతిలో ఇచ్చిన రెండో అనుమతిగా మంత్రి వివరించారు. మొదటి అనుమతిగా, 10 టోల్ కేంద్రాలున్న 681 కి.మీ. ప్రాజెక్టును ఎంఏఐఎఫ్ సంస్థకు 2018లో ఎన్‌హెచ్‌ఏఐ అప్పగించింని, ఇందుకుగాను, రూ.9,681.5 కోట్లను ముందస్తుగా పొందిందని చెప్పారు. పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా నిధుల ఆర్జన కోసం, టీవోటీ పద్ధతిలో మరిన్ని విస్తరణలు అప్పగించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టిందని మంత్రివివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.