ఇక మనకూ దేశీయ నౌక పర్యవేక్షణ వ్యవస్థ..
Ens Balu
2
New Delhi
2020-10-20 17:27:27
దేశీయంగా ఉత్పత్తి చేసిన నౌకా ట్రాఫిక్ సేవలు (Vessel Traffic Services (VTS)), నౌకల ట్రాఫిక్ ను పర్యవేక్షించే వ్యవస్థలను (Vessels Traffic Management Systems) సాఫ్ట్‌వేర్ సొల్యుషన్‌ను మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి (ఇన్‌ఛార్జి) మన్‌సుఖ్ మాండవీయ ఇ- మాధ్యమం ద్వారా ప్రారంభించారు. భారతీయ ఓడ రేవులలో ట్రాఫిక్ నిర్వహణ కోసం విదేశాలలో చేసిన ఖరీదైన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లుకు బదులుగా మన అవసరాలకు తగిన దేశీయ వ్యవస్థల అభివృద్ధి కోసం కృషి చేయాలని తన ప్రారంభోపన్యాసం మంత్రి మాండవీయ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతతో మిళితమై, మేడిన్ ఇండియా విటిఎస్, విటిఎంఎస్ సాఫ్ట్ వేర్‌లు నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను ప్రపంచం కోసం తయారు చేసే మార్గాన్ని సుగమం చేస్తాయని మాండవీయ వివరించారు. నౌకల స్థానాలు, ఇతర ట్రాఫిక్ ప్రాంతం లేక వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలతో పాటు ఒక ఓడరేవులో లేక జలమార్గంలో విస్త్రతంగా ట్రాఫిక్‌ను నిర్వహించేందుకు విటిఎస్, విటిఎంఎస్ సాఫ్ట్ వేర్ నిర్ధారిస్తుందన్నారు. సముద్రంలో జీవన భద్రతకు, సముద్రయాన నిర్వహణ భద్రత, సామర్ధ్యానికి, సముద్ర పర్యావరణ భద్రతతో పాటు, చుట్టు పక్కల గల తీర ప్రాంతాలు, ఆఫ్‌షోర్ స్థావరాలు, కర్మాగారలను నౌకాయాన రద్దీ చెడు ప్రభావాల నుంచి కాపాడేందుకు విటిఎస్ ఎంతో దోహదం చేస్తుందన్న మంత్రి విటిఎంఎస్‌లను ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే జలాలలో ఏర్పాటు చేసుకోవచ్చున్నారు. అవి సురక్షితమైన నౌకాయానానికి, మరింత సమర్ధవంతమైన ట్రాఫిక్ ప్రవాహానికి, పర్యావరణ పరిరక్షణకు విలువైన సహకారాన్ని అందిస్తాయని, సమీప మార్గాలలో బిజీగా ఉండే ట్రాఫిక్ ప్రవాహం, మార్గాలను, ఓడరేవులను అందుబాటులోకి తెచ్చుకొని, ఓడరేవు, దాని వినియోగదారుల ఉత్తమ ప్రయోజనాల కోసం సురక్షితంగా సమన్వయం చేసుకోవచ్చునన్నారు. జలాల్లో జరిగే ప్రమాదాలను, అత్యవసర పరిస్థితుల త్వరితంగా పరిష్కరించుకోడంతో పాటు ట్రాఫిక్ కదలికలకు సంబంధించిన డాటాను స్టోర్ చేసి, ఓడరేవు అధికారులు, పాలనా యంత్రాంగం, కోస్ట్‌గార్డ్ లు, సెర్చ్ అండ్ రెస్క్యూ సేవల బృందాలు సూచన సమాచారంగా వినియోగించుకోవడానికి ఈ వీటిఎస్ ఎంతో దోహదపడుతుందని స్పష్టం చేశారు..