గీతం అక్రమాస్తులు నేలమట్టం..


Ens Balu
1
Githam College
2020-10-24 21:40:27

వెయ్యిగొడ్లను తిన్న రాబందు ఒక్క గాలీవానకు కుప్పకూలినట్టు...ఎన్నో ప్రభుత్వాల అండతో 40 ఎకరాల ప్రభుత్వభూమి అక్రమంగా ఖబ్జా చేసిన గీతం విద్యా సంస్థలు...గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ(నేరుగా డీమ్డ్ యూనివర్శిటీ అనిరాయకూడదని.. ఈ విధంగానే   రాయాలని యూజిసి కూడా మొట్టికాయవేసింది) అక్రమ ఆస్తులు, కట్టడాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పా కుప్పకూలలేదు...ఇవేవో కావాలని అంటున్న మాటలు కాదు...ఎన్నో ఏళ్ల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మసి పూసి, మారేడుకాయ చేసి ఆక్రమించిన ఆస్తులను ఆధారాలతో, రెవిన్యూశాఖ, సహా మహావిశాఖ నగరపాలక సంస్థ ఒక్కపెట్టున కుప్పకూల్చింది. మేమంతా స్పష్టంగా వున్నామని భీరాలు పోయిన గీతం విద్యాసంస్థలు, జీవీఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను జేసీబీలతో పెకిలించేస్తుంతే కళ్లప్పగించి చూడటం తప్పా మరేమీ చేయలేకపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 ఎకరాల కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఖబ్జా చేసిన గీతం విద్యాసంస్థలు...యాజమన్యం వీరి అక్రమాలపై వార్తలు రాస్తే సైబర్ క్రైమ్ కేసులు పెట్టింది...వాస్తవాలను నిగ్గుతేల్చిన రెవిన్యూశాఖ, జీవిఎంసీలు మీ నిర్మాణాలు, ఖబ్జాలని సక్రమం కాదంటూ కూల్చేయడం చర్చనీయం అవుతుంది. అంతేకాదు...ఈ విద్యాసంస్థ అక్రమాల మయం అని యూజిసి గుర్తిస్తే ఆ ప్రమాదం మరింతగా పడుతుంది... విశాఖ నగర శివారులోని రుషికొండ సమీపాన పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలో ఉంచుకున్న గీతం టూబీ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 40 ఎకరాలు గీతం యూనివర్సిటీ ప్రభుత్వ భూమిని అనుభవిస్తున్నట్లు రెవెన్యూ అధికారుల ప్రాథమిక విచారణలో రుజువైంది. దీంతో ఆర్డీవో పెంచల కిషోర్ పర్యవేక్షణలో రెవిన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసివేశారు. గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ యాజమాన్యం గుప్పిట్లో 40.51 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని జిల్లా రెవిన్యూ అధికారులు ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎండాడ, రుషికొండ పరిసరాల్లోని భూముల్ని ఆక్రమించేసుకుని సంస్థ పరిధిలో కలిపేసుకున్నట్లు రెవిన్యూ అధికారులు పూర్తి ఆధారాలతో గుర్తించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టి సవివర నివేదికని ప్రభుత్వానికి మరోసారి అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గీతం పరిధిలో కోర్టు కేసుల్లో ఉన్న భూములు ఏఏ గ్రామాల పరిధిలో ఉన్నాయి.? ఆక్రమణలు ఎంత మేర జరిగాయన్నదానిపై కూడా నివేదిక అన్నిరకాల కొలతలతోనూ సిద్ధమవుతోంది.