వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిఘా చైతన్య వారోత్సవం..
Ens Balu
1
New Delhi
2020-10-25 15:03:26
‘సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్’ ఇతివృత్తం తో సాగే నిఘా, అవినీతి నిరోధం అంశాలపై ఏర్పాటైన జాతీయ సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 27 న సాయంత్రం 4:45 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుందని పీఎంఓ తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని https://pmindiawebcast.nic.in/ లింకు ద్వారా చూడవచ్చు. ప్రతి ఏటా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 తేదీల మధ్య భారతదేశం లో ‘నిఘా చైతన్య వారోత్సవం’ కాలంలో ఈ జాతీయ సమ్మేళనాన్ని కేంద్ర దర్యాప్తు బ్యూరో నిర్వహిస్తూ వస్తోంది. ఈ సమ్మేళనం లో భాగంగా చేపట్టే కార్యకలాపాలపై నిఘా కు సంబంధించిన అంశాల మీద దృష్ఠి ని కేంద్రీకరించడం జరుగుతుంది. 3 రోజుల పాటు కొనసాగే ఈ సమ్మేళనం లో భాగంగా- విదేశీ అధికార పరిధుల లో దర్యాప్తు క్రమం లో ఎదురయ్యే సవాళ్లు; అవినీతి ని అడ్డుకోవడానికి వ్యవస్థ పరంగా ఉన్న కట్టడి రూపం లో ప్రివెంటివ్ విజిలెన్స్ ను ఉపయోగించడం; వృద్ధి ని ముందుకు తీసుకుపోయేందుకు లెక్కల తనిఖీ (ఆడిట్) ని ప్రభావశీలమైన పద్ధతిలో ఉపయోగించడం; అవినీతి పై పోరాటం లో ఉత్తేజాన్ని ఇచ్చేందుకు అవినీతి నివారక చట్టం లో తాజాగా చేసిన సవరణ లు; సామర్థ్యం పెంపుదల- సిబ్బందికి శిక్షణ; త్వరిత గతిన, అధిక ప్రభావాన్ని కనబరచే దర్యాప్తు నకు తోడ్పడేటట్లుగా బహుళ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడం; ఆర్థిక నేరాలలో కొత్త ధోరణులను, సైబర్ క్రైమ్స్ ను, దేశాల మధ్య చోటుచేసుకొంటున్న సంఘటిత నేరాలను నివారించే చర్యలు; నేర పరిశోధక సంస్థ ల మధ్య ఉత్తమ అభ్యాసాలను ఇచ్చి పుచ్చుకోవడం- వంటి అంశాలు చర్చ కు రానున్నాయి.