గీతం చుట్టూ బిగిసుకుంటున్న భూ ఆక్రమణ ఉచ్చు..


Ens Balu
2
గీతం విద్యాసంస్థలు
2020-10-29 14:33:47

విశాఖలో 40 ఎకరాలు ప్రభుత్వభూమిని నిస్సుగ్గుగా ఆక్రమించిన గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ చుట్టూ ఉచ్చు బిగుకుకంటున్నట్టు కనిపిస్తుంది. ఒక ప్రైవేటు యూనివర్శిటీగానీ, డీమ్డ్ యూనివర్శిటీగానీ స్థాపించాలంటే ఎలాంటి అవకతవకలు లేని భూమి, వసతులు, అద్యాపకులు, ఇలా అన్నిరాకాలుగా క్లీన్ చిట్ వున్న విద్యాసంస్థలకు మాత్రమే యూనివర్శిటీ ఎస్టాబ్లిస్ మెంట్ యాక్ట్ 1957 ద్వారా యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) అనుమతులు ఇస్తుంది. విద్యాసంస్థల్లో వున్న అదే వసలు, అత్యున్నతంగా వుంటే దానికి నాక్(నేషనల్ ఎసెస్ మెంట్ అక్రిడిటేషన్), డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో(డిఇబి), ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (సాంకేతిక విద్య కోసం) అనుమతులు ఇస్తాయి. ఈ అనుమతులన్నీ గీతం టుబి డీమ్డ్ యూనివర్శిటీ ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని అభివ్రుద్ధి చేసి కేంద్ర ప్రభుత్వ సంస్థలను తమవే అన్నట్టు చెప్పాయని జెఏసి అధ్యక్షులు జెటి రామారావు ఆరోపించారు. దీంతో కేక్ ఏ ప్లస్ ప్లస్ గ్రేడు మంజూరు చేసింది. తీరా ఇపుడు రాష్ట్ర ప్రభుత్వ భూములను 40 ఎకరాలకు పైగా అన్యాక్రాంతం చేశారని తేలింది. అలాంటపుడు ఏవైతే కేంద్ర సంస్థలు గుర్తింపు ఇచ్చాయో అవన్నీ సుమోటా వారి గుర్తింపు రద్దు చేయాల్సి వుంది. అంతేకాకుండా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కూడా గీతం విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఆస్తులను స్వాధీనం చేసుకున్న సమయంలో కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న గీతం తదుపరి కూల్చివేతలను ఆపుకోగలిగింది తప్పితే, ఇతరత్రా అంశాలను అడ్డగోలుగా ఆపుకునే పరిస్థితి లేకుండా పోయింది.  ప్రభుత్వం నుంచి నేరుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన యూజిసి, నాక్, డిఇబి, ఏఐసిటిఇ లకు గీతం భూ దురాక్రమణలపై ఫిర్యాదులు వెళితే విద్యాసంస్థ గుర్తింపు రద్దు అవడం దాదాపు ఖాయమని తెలుస్తుంది. ట్రస్టు పేరుతో ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థ ప్రభుత్వ ఆస్తులను 38ఏళ్లుగా ఎలాంటి పన్నులు కట్టకుండా దురాక్రమణ చేయడంతోపాటు, ఇపుడు ప్రభుత్వమే నేరుగా ఆక్రమిత ఆస్తులను స్వాధీనం చేసుకునే వరకూ తెచ్చుకుంది గీతం. ఈ సమయంలో గీతం టుబి యూనివర్శిటీలోని ప్రభుత్వ ఆక్రమిత ఆస్తులు విద్యాసంస్థవి కాదని తెలిసిన వెంటనే సదరు సంస్థలు గుర్తింపుని అన్నింటినీ రద్దు చేయాలి...కారణం అవన్నీ గీతం ఆస్తులు కావు, పైగా దురాక్రమణ చేసినవి. ఈ విషయమై ఏపి ప్రజా సంఘాల సమాఖ్య అధ్యక్షులు జెటి రామారావు సైతం ఇటు సిబిఐ, ఇడిలకు ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటున్న కేంద్రప్రభుత్వ సంస్థలు గీతం పై ద్రుష్టి కేంద్రీకరించినట్టు కూడా సమాచారం గట్టిగానే ప్రచారం జరుగుతుంది.పైగా గీతం టుబీ డీమ్డ్ యూనివర్శిటీ విషయంలో యూజిసి ఇచ్చిన నోటీసుల(నేరుగా డీమ్డ్ యూనివర్శిటీ అనకూడదు, డీమ్డ్ టుబీ డీమ్డ్ యూనివర్శిటీ అని మాత్రమే అనాలి) ను మీడియాలో వార్తలు రాసినందుకు సోషల్ మీడియా, ఇతర మీడియా సంస్థలపై సైబర్ క్రైమ్ కేసు పెట్టిన గీతం యాజమాన్యమే ఒక అడ్డగోలు దురాక్రమణ విద్యాసంస్థ అని రాష్ట్ర ప్రభుత్వం ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వ సంస్థలు తీసుకోబోయే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా చర్యలు తీసుకునేంత వరకూ తమ ఉద్యమం ఆపేది లేదని ప్రజా సంఘాల జేఏసి అధ్యక్షులు జెటి రామారావు హెచ్చరిస్తున్నారు..