గీతంపై ఈఎన్ఎస్ కధనాలు అక్షరసత్యాలు..


Ens Balu
4
Visakhapatnam
2020-10-29 18:02:03

అక్రమ భూఖబ్జాకోరు గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ అధికార మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ప్రచురించిన ప్రతీ న్యూస్ కార్డ్(వార్తలు) అక్షర సత్యాలయ్యాయి.. ఆ విషయం వైఎస్సార్సీపీ రాజ్యసభ  సభ్యులు వి.విజయసాయిరెడ్డి యూజీసి చైర్మన్ కి రాసిన లేఖతో మరోసారి ఆ విషయం రాష్ట్ర ప్రజలకు, గీతంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు, గీతం టుబీ యూనివర్శిటీకి, తేడా మీడియా సంస్థలకు, సైబర్ సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసిన యాజమాన్యానికి అర్ధమైంది. అంతేకాదు గీతం విద్యా సంస్థల విషయంలో సమర్పించిన తప్పుడు సమాచారం పై విచారణ చేయాలని, విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదులు గీతం వెన్నులో ప్రకంపణలు స్రుష్టిస్తున్నాయి. ఆది నుంచి గీతం విషయంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ వాస్తవాలు చెబుతూనే వుంది. గీతంకి యూజిసి నోటీసులు ఇచ్చిన విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఈఎన్ఎస్ మాత్రమే ఆధారాలతో సహా బయటపెట్టింది. అప్పటి వరకూ గీతం డీమ్డ్ యూనివర్శిటీ అని బోర్డుపై రాసుకున్న గీతం సంస్థ, ఈఎన్ఎస్ న్యూస్ కార్డ్ ఎఫెక్ట్ తో ఆ తరువాత గీతం టుబీ యూనివర్శిటీ అని పేరు మార్చుకుంది. అక్కడి నుంచి గీతంలోని తేడా అంశాలపై విషయాలపై పదే పదే వార్తలు రాయడంతో గీతం సోషల్ మీడియా న్యూస్ యాప్స్ పైనా, కొన్ని పత్రికలపైనా, వెబ్ సైట్లపైనా సైబర్ క్రైమ్ కేసు నమోదు చేసినట్టు ప్రకటించింది. ఆ సమయంలో కూడా ఈఎన్ఎస్ వెనక్కి తగ్గలేదు. యూజీసీ గీతం కి ఇచ్చిన నోటీసులను మరోసారి ఈఎన్ఎస్ అధికారిక ఫేస్ బుక్ పేజి ద్వారా భహిర్గతం చేసింది. ఆతరువాత గీతం పాపం పండిండి... అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం గీతం విద్యాసంస్థలు సుమారు 40.50 ఎకరాల ప్రభుత్వ భూమి యాజమాన్యం ఖబ్జా చేసిందని ఆక్రమణలను కూలగొట్టి తొలగించి కొంత స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అప్పటికే ఆగ మేఘాలపై ఆక్రమిత స్థలంలో శాస్వత కట్టడాలను కూల్చకుండా కోర్టు నుంచి స్టే తెచ్చుకుంది గీతం యాజమాన్యం. ఆతరువాత కూడా ఈఎన్ఎస్ దేశ వ్యాప్తంగా యూనివర్శిటీలకు అనుమతినిచ్చే 1956ను అనుసరించి ఏవిధమైన అనుమతులు ఇస్తుందో, విద్యాసంస్థ చూపించిన ఆస్తులు నకిలీవి, ఆక్రమణలు అయితే గుర్తింపు పరిస్థితి ఏంటనే విషయాన్ని కూడా న్యూస్ కార్డ్ అందించింది. అంతేకాదు. జాతీయ స్థాయిలో డీమ్డ్ యూనివర్శిటీలన్నీ భయపడే విధంగా ఈఎన్ఎస్ ప్రత్యేకంగా పరిశోధన చేసి మరీ ఈ వార్తా కధనాలు భయటపెట్టడంతో గీతం యాజమాన్యం ఒక్కసారిగా ఒణికిపోయింది. తన బాజా బజంత్రీ మీడియా ద్వారా గీతంలో ఏదీ లేదన్నట్టుగానే ప్రచారం చేసుకుంటూ వచ్చింది. గీతం విషయంలో అన్నీ అక్రమాలేనని దానికి రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి యూజిసికి చేసిన ఫిర్యాదు ఈఎన్ఎస్ వార్తలను నిజం చేస్తూ..బాహ్యప్రపంచానికి తెలియజేసేలా చేశాయి...ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ పరిశోధనాత్మక కధనాలు  ఎప్పుడూ ఒమ్ముకాలేదని మరోసారి రుజువైంది. ప్రజల పక్షాన అక్షర సమరం చేసే ఈఎన్ఎస్...తెలుగు ప్రజల గుండె చప్పుడికి అనుగుణంగా వార్తలు(న్యూస్ కార్డ్) వేస్తుందని  తెలియజేస్తున్నాం..ఎలాంటి పరిస్థితులనైనా దైర్యంగా ఎదుర్కుంటామని కూడా తేడాగాళ్లను హెచ్చరిస్తున్నాం..!