యూజీసిలో గీతం భూ ఆక్రమణ ప్రకంపనలు..!
Ens Balu
3
Visakhapatnam
2020-11-03 16:30:45
విశాఖకు గీతం వలనే పేరొచ్చింది..గీతం వలనే ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు వచ్చింది.. అసలు ప్రపంచంలోనే గీతం టాప్ డీమ్డ్ టుబీ యూనివర్శిటీల్లో ఒకటి అని తెగ బీరాలు పోయిన గీతం విద్యాసంస్థల యాజమాన్యానికి రాష్ట్రప్రభుత్వం గీతం భూ దురాక్రమణలపై తీసుకుంటున్న చర్యలతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.800 కోట్ల రూపాయల విలువచేసే 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా ఖబ్జాచేసిన విషయం రాష్ట్రప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకొని బట్టబయలు చేయడంతో...యూజిసిలో గందర గోళం జరుగుతున్న వేళ ఇప్పటి వరకూ వచ్చిన పేరుని పోకుండా ఉండటానికి తన భజన మీడియా సంస్థలకు ప్రత్యేక ప్రకటనలు టీవీలు, పత్రికల ద్వారా ఇచ్చి విద్యార్ధులను తప్పుదోవ పట్టిస్తోందనే విషయం అందరికీ అర్ధమైపోయింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కేబినెట్ లో జరిగిన ముఖ్యమైన అంశాల్లో గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని తీర్మాణం చేయడం దేశంలోనే సంచనలం కలిగిస్తోంది. ఒక ప్రైవేటు డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ప్రభుత్వ ఆస్తులను ఎవరి అండతో ఇంతలా ఖబ్జా చేయగలిగిందనే విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. అదేసమయంలో దేశంలోని ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీలను ఏకంచేసే ప్రయత్నానికి కూడా రాష్ట్రప్రభుత్వ పెద్దలు యూజిసికి రాసిన లేఖ ద్వారా అదికాస్త విఫలమైంది. లేదంటే ఒక ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీపై రాష్ట్రప్రభుత్వ పెత్తనమనే కోణంలో బలాన్ని కూడగట్టాలని చూసిన తెరచాటు ప్రతినిధులకు ఎంపీ వి.విజయసాయిరెడ్డి యూజీసికి గీతం విద్యాసంస్థలు ఎలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేశాయో తెలుపుతూ రాసిన లేఖలు దేశవ్యాప్తంగా డీమ్డ్ టుబీ యూనిర్శిటీల్లో ప్రకంపణలు స్రుష్టిస్తున్నాయి. అదే సమయంలో యూజీసి నుంచి వస్తున్న ఆదరణకు కూడా అడ్డుకట్ట పడిందనే చెప్పాలి. పక్కా ఆధారాలతో రాష్ట్రప్రభుత్వంలోని ఒక రాజ్యసభ సభ్యుడు యూజిసికి లేఖ రాసిన తరువాత దానిని కప్పిపుచ్చాలని చూస్తే దాని యొక్క ప్రభావం మిగతా డీమ్డ్ టుబీ యూనివర్శిటీలపై పడుతుందని గీతం భజన మీడియాకి అర్ధమైపోయింది. దీంతో యూజిసిలో జరుగుతున్న వ్యవహారాలు, విజయసాయిరెడ్డి లేఖపై యూజీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందనే విషయాలపై ఒక్క కధనం కూడా వెలవరించకుండా వదిలివేయడంతో ఎంజరగబోతుందనే కోణంలో వేచి చూస్తున్నాయి. పైగా గీతం విషయంలో వస్తున్న వ్యతిరేక కధనాలను ఏరికోరి దాచుకొని, అందులోని ఏదైనా ఒక్క తప్పు దొర్లితే వ్యతిరేక వార్తలు రాసేవారిపై కేసులు పెట్టాలని చూస్తున్న గీతం విద్యాసంస్థలకు తాము చేసిందే అతి పెద్ద తప్పని అర్థమైపోయింది. అంతేకాకుండా ఇటీవల యూజీసి డీమ్డ్ టుబీ యూనివర్శిటీల విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను వార్తలుగా ప్రచురించిన మీడియాపై గీతం యాజమాన్యం కేసులు పెట్టడం కూడా గీతం యాజమాన్యం చేసిన తప్పుల్లో మరొక అంశం కూడా. ఇపుడు ఆ విషయంపైనా యూజీసి తక్షణమే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ప్రజా సంఘాల జేఏసి అధ్యక్షులు ఇప్పటికే కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సంస్థలకు, పోలీసులకు ఫిర్యాదులు కూడా చేశారు. అన్ని అంశాలు గీతం విద్యాసంస్థల భూఆక్రమణకు, చేసిన పనులకు వ్యతిరేకంగా ఉండటంతో యూజీసి తీసుకునే నిర్ణయంపైనే ఆదారపడి ఉన్నాయి. ఒక్కసాయి యూజిసి తన నిర్ణయాన్ని ప్రకటిస్తే.. గీతం పని గోవింద...!