గీతం వాణిజ్య ఆస్థి పన్నులపై జీవీఎంసీ కన్ను..


Ens Balu
3
Rushikonda Beach
2020-11-04 10:18:05

విశాఖలో రుషికొండ ప్రాంతంలో 40.50ఎకరాల ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేసి మరీ నిర్మాణాలు చేసిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీపై జీవిఎంసి కన్నేసినట్టు తెలుస్తోంది.. గీతం విద్యాసంస్థలు మొత్తం ఎన్ని ఎకరాల ప్రారంగణంలో ఆక్రమించి ఉన్నాయి..ఎన్ని ఎకరాల్లో నిర్మాణాల్లో నిర్మాణాలు చేశారు.. అందులో వాణిజ్య సముదాయం(క్యాంటీన్, మెడికల్ షాపు, మెడికల్ ల్యాబులు, స్కానింగ్ సెంటర్లు, ఫిజియో థెరపీ సెంటర్లు, మెడికల్ కాలేజీ) ఎంత.. ఇప్పటి వరకూ మహానగరపాలక సంస్థకు ఎంత మేర ఆస్థి పన్నులు చెల్లించారు..జీవిఎంసీ అనుమతి లేకుండా ఎన్ని నిర్మాణాలు కొత్తగా నిర్మించారు.. నిర్మిస్తే వాటికి ఎవరి దగ్గర అనుమతులు తీసుకున్నారు.. అనుమతిలేకుండా ఎలా నిర్మించారు...నిర్మించిన వాటికి ఎందుకు పన్నులు కట్టలేదు తదితర అంశాలను జివిఎంసి అధికారులు పరిగణలోనికి తీసుకున్నట్టు సమాచారం. రెవెన్యూశాఖకు చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎవరి అనుమతితో సబ్ వే నిర్మాణం ఎంత స్థలంలో నిర్మించారనే విషయాన్ని కూడా జివిఎంసీ లెక్కలు వేయడానికి సిద్ధ పడుతోంది. మరోపక్క ట్రస్టు పేరుతో విద్యాసంస్థలను, గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీని నిర్వహిస్తూ, వేలు, లక్షల్లో తీసుకుంటున్న ఫీజులపై జీఎస్టీ ఎంత చెల్లిస్తున్నారనే కోణంలో కూడా ప్రభుత్వం గీతం ను చుట్టిముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ ట్రస్టు పేరుతో కొన్ని పన్నులు ఎగతవేత వేసినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో ట్రస్టు పేరుతో నిర్వహించే డీమ్డ్ టుబీ యూనివర్శిటీలోనూ, మెడికల్ కాలేజీలోనూ వసూలు చేసే ఫీజులపైనా ప్రభుత్వం చక్రబంధం చేసేటట్టు కనిపిస్తుంది. అదే అంశాలను కోర్టుకి కూడా నివేదించడానికి రాష్ట్రప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకూ జరిపిన లావాదేవీలను కూడా వెలికితీసేందకు కార్యాచరణ చేపట్టే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వ ఆస్తులను దురాక్రిమించి ట్రస్టుపేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుదోవపట్టించే విధంగా పత్రాలు, సమాచారం సమర్పించిన విషయమై ఇప్పటికే ఇటు యూజీకి, అటు నేషనల్ మెడికల్ కమిషన్ కు రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ఫిర్యాదులు చేశారు. మరో వైపు ప్రజా సంఘాల జెఎసి అధ్యక్షడు జె.టిరామారావు కూడా ఈ విషయంలో సిబిఐ, ఈడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఒక రాజ్యసభ్యుడు ఒక ప్రైవేటు యూనివర్శిటీలో జరిగిన అవినీతిని, అక్రమాలను ఆధారాలతో చేసిన ఫిర్యాదులపై స్పందిచిన రెండు కేంద్ర పరభుత్వ సంస్థలు గీతంపై ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలోనే గీతం విద్యాసంస్థల యాజమాన్యం కూడా ఆత్మరక్షణలో పడింది. గీతం ట్రస్టు పేరుతో కట్టకుండా వదిలేసిన వాణిజ్య సముదాయాల పన్ను విషయమై జివిఎంసి కన్నేసి, మొత్తం ఆస్తుల విలువను అంచనే వేసే దిశగా చర్యలు ప్రారంభించింది. అలా అంచనాలు బయటకు వస్తే..కోట్ల రూపాయల్లో పన్నులు కట్టే పరిస్థితి ఏర్పడవచ్చు... ఉత్కంఠ రేపుతున్నఈ వ్యవహారం గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ భూ అక్రమాల తెరపై చూడాల్సిందే..