రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది..
Ens Balu
3
Telangana
2020-11-04 15:44:06
సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవితా రాజశేఖర్ మీడియా ముందుకి వచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని రాజశేఖర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రిలో ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు.. రాజశేఖర్ ఆరోగ్యం ముందుకన్నా చాలా మెరుపడిందని చెప్పారు.. ప్రస్తుతం వైద్యానికి ఆయన సహకరిస్తున్నారన్నారు. మొదట చాలా క్రిటికల్ స్టేజి వరకు వెళ్లారని ఆ సమయంలో... వైద్యులు, మేము కూడా చాలా భయపడ్డామన్నా జీవి డాక్టర్లు అనుక్షణం ఆయనను కనిపెట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నారని అన్నారు. ఇప్పుడిప్పుడే ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందుతోందని, తొందరలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది' అమె వివరించారు. దేవుడి దయతో, అభిమానుల పూజలతో ఆయన ఆరోగ్యం కుదుట కుదుట పడిందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని కోరుకున్నవారందరికి ప్రత్యేక ధన్యవాదాలు' తెలిపారు. దీంతో రాజశేఖర్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టు అయ్యింది..