భూ అక్రమాల గీతంపై యూజీసి స్టాండేంటి..?
Ens Balu
3
Rushikonda
2020-11-05 08:31:31
విశాఖలో ప్రభుత్వానికి చెందిన రూ.800 కోట్లు విలువచేసే 40.50 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేసుకొని సొంతభూమిగా ప్రభుత్వ అనుమతులు లేకుండా అభివ్రుద్ధి చేసి, జీవిఎంసీకి తెలీకుండా సబ్ వేని నిర్మించిన భూ దురాక్రమణ గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజిసి) ఏ విధమైన స్టాండుతో ఉంటుందనే అంశం ఉత్కంఠను రేపుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించి ప్రైవేటు యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్శిటీలు నేరుగా యూనివర్శిటీ అని ప్రకటించకూడదని హెచ్చరించిన యూజీసి అసలు ఆస్తులే కానివాటిని దురాక్రమించి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మోసం చేసిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాసిన లేఖతో అటు యుజిసి కూడా అంతర్మధనంలో పడింది. వాస్తవంగా ప్రైవేటు యూనివర్శిటీలు ఏర్పాటు చేసేటప్పుడు, సదరు విద్యాసంస్థ యొక్క ఆస్తులు, భవనాలు, లోపల నిర్మాణాలు ఎలాంటి వివాదాలకు తావులేకుండా క్లీన్ చిట్ ఉన్న విద్యాసంస్థలకే యూజిసి టుబీ యూనివర్శిటిగా తొలుత అనుమతులు మంజూరు చేస్తుంది. అలాంటిది గీతం విద్యాసంస్థలు ఏకంగా ప్రభుత్వ భూమిని ఆక్రమించడం, ఆ విషయాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆక్రమిత భూములను స్వాధీనంచేసుకుంది. ఆక్రమిత భూమిలో స్థానిక మున్సిపల్ కార్పోరేషన్ అనుమతులు లేకుండా నిర్మించిన సబ్ వే ను కూలగొట్టేందుకు ప్రయత్నించే సమయంలో కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న గీతం యాజమాన్యంపై యూజిసి సీరియస్ గానే ఉన్నట్టు సమాచారం అందుతోంది. అంటే యూజిసికి కూడా గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ భూములన్నీ తేడా అనే విషయం మొదట స్పష్టమైంది. రెండవది ఒక విద్యాసంస్థ ఏర్పాటుకి ప్రభుత్వాని తెలియకుండా భూములను ఎలా ఆక్రమించి నిర్మాణాలు చేస్తుంది...ఇలాంటి విద్యాసంస్థలు విద్యార్ధులకు భూ అక్రమాలపైనే విద్యనందిస్తాయా అనే కోణంలో కూడా యూజిసి ఆలోచిస్తుందని సమాచారం. చిన్న తేడా వస్తేనే ప్రభుత్వరంగ యూనివర్శిటీల విషయంలోనే జూలు విధిచ్చే యూజీసి.. 38ఏళ్లుగా సేవలందిస్తున్నట్టు తన విద్యాసంస్థ వెబ్ సైట్ లో రాసుకున్న విద్యాసంస్థ, అదే యూనివర్శిటీకి యూజిసి అనుమతులు ఇచ్చిన నాటి నుంచి ప్రభుత్వ భూమిని ఆక్రమించే ఉందని విజయసాయిరెడ్డి యూజిసికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంటే తమవి కాని భూములను తమవే అన్నట్టు యూజిసిని, నేషనల్ మెడికల్ కమిషన్ ను కూడా మోసం చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల విషయంలో తేటతెల్లమైంది. ఎటుచూసినా గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ తమ విద్యాసంస్థ ప్రాంగణలో ప్రభుత్వ భూములు ఖబ్జా చేసినట్టు రుజువైనందున యూజిసి గుర్తింపు రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందులోనూ అధికారపార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు ఆధారాలతో చేసిన ఫిర్యాదుపై యూజిసి తన స్టాండ్ ఏమిటో చెప్పకపోతే దేశంలో యూసికి వున్న గౌరవం మసకబారే సూచనలున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే గీతం విషయంలో యూజిసి తన స్టాండుని తక్షణమే ప్రకటించాల్సిన సమయం ఆశన్నమైంది. అంతేకాకుండా ఇక్కడ చదువుతున్న విద్యార్ధుల భవిష్యత్తుకి ఎలాంటి భంగం కాకుండా కూడా నిర్ణయం తీసుకోవాల్సి అవసరం కూడా ఉందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఇలాంటి తరుణంలో యూజిసి తన స్టాండ్ గీతం విషయంలో ఏ విధంగా ప్రకటిస్తుందనేది వేచి చూడాలి..!