రైల్వే డిజిటల్ సరఫరా చెయిన్ ను జిఇఎంతో అనుసంధానం
Ens Balu
4
New Delhi
2020-07-27 08:44:56
భారత ప్రభుత్వవిభాగాలలో, భారతీయ రైల్వేలోని ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియలలో మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించేందుకు తీసుకోవలసిన చర్యలపై రైల్వే, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భారతీయ రైల్వేలలో అవినీతి రహిత, పారదర్శక ప్రొక్యూర్‌మెంట్ విధానం ఉన్నదన్న విశ్వాసం పరిశ్రమ వర్గాలలో కల్పించాలని సూచించారు.
ప్రోక్యూర్‌మెంట్ ప్రక్రియలో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులును ప్రోత్సహించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమీక్షిస్తూ ఆయన, ప్రోక్యూర్ మెంట్ ప్రక్రియలో స్థానిక వెండర్లు పాల్గొనడాన్ని పెంచేలా చూడాలని నొక్కి చెప్పారు. స్థానిక వెండర్లు, సరఫరా దారుల నుంచి మరిన్ని బిడ్లు వచ్చే విధంగా ప్రొక్యూర్ మెంట్ నిబంధనలలో స్థానిక కంటెంట్ క్లాజు ఉండాలని నిర్ణయించారు.ఇది ఆత్మనిర్భర్‌భారత్ మిషన్‌కు మరింత ఊపు నివ్వనుంది. ఈ దిశగా భారతీయ రైల్వే కృషి చేసేందుకు వీలుగా అవసరమైతే డిపిఐఐటిని విధానపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా కోరి దాని మద్దతు తీసుకోవాలని అన్నారు.
స్థానికంగా తయారయ్యే వస్తువులను ఎవరు ఎక్కువగా సరఫరాచేయగలుగుతారో అలాంటి వెండర్లకు ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ప్రొక్యూర్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన వివిధ అంశాలపై వెండర్లకు స్సష్టత వచ్చేందుకు హెల్ప్ లైన్ నెంబర్, తరచూ అడిగే ప్రశ్నలు, సమాధానాల సెక్షన్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచన చేయడం జరిగింది.
మేక్ ఇన్ ఇండియాను పెంపొందించడం, జిఇఎం ద్వారా వివిధ ఉత్పత్తులు సేకరించడానికి తీసుకుంటున్న చర్యలు ,ఈ దిశగా జరిగిన పురోగతి తదితర విషయాలపై రైల్వే బోర్డు మెటీరియల్స్ మేనేజ్ మెంట్ సబ్యుడు సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశానికి రైల్వేశాఖ సహాయమంత్రి శ్రీ సురేష్ సి అంగడి, రైల్వేబోర్డు సభ్యులు, సిఇఒ, జిఇఎం, వాణిజ్య మంత్రిత్వశాఖకు చెందిన డిపిఐఐటి ప్రతినిధులు హాజరయ్యారు.