సుజనా ఇదినీకు తగునా..
Ens Balu
3
New Delhi
2020-11-13 17:30:43
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎయిర్ పోర్టులో చుక్కెదురైంది.. బ్యాంకు కుంభకోణం కేసులో సుజనాపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడం.. ఆపై అమెరికాకు బయలుదేరిన సుజనాను శుక్రవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అధికారులు అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఆయనను ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని నిలిపివేశారు. మరోవైపు తాజా నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి.. తనను అక్రమంగా అడ్డుకున్నారని, లుక్‌ఔట్ నోటీసులు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే రాజ్యసభ్యులు సుజనా బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ.322.03 కోట్ల రుణం ఎగవేతకు పాల్పడ్డారు. వడ్డీతో కలిపి రూ.400.84 కోట్లకు చేరుకోవడంతో వేలానికి నోటీసు కూడా జారీచేసింది. తిరిగి చెల్లించాలని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా సుజనా చౌదరి స్పందించకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేసేందుకు బ్యాంకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్ట్, సుజనా టవర్స్ లాంటి లిస్టెడ్ కంపెనీలతోపాటు మరో 102 ఇతర కంపెనీలున్నాయి. సుజనా పరోక్షంగా నడిపించే బార్ర్‌టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. మరో 4 కంపెనీలు (విజయ్ హోం అప్లయన్సెస్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ కాంప్ట్రాన్) మినహా మిగిలినవన్నీ షెల్ కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత కార్యకలాపాలలో దిట్ట. సుజనా గ్రూపు సంస్థలు వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.8,000 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదని బ్యాంకు అధికారులు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది..