ఏపీ లెజిస్లేచర్ లో ’గీతం‘ బిల్లు రద్దు దిశగా..
Ens Balu
3
Velagapudi
2020-11-16 12:28:11
ఒక ప్రైవేటు యూనివర్శిటీ ఏర్పాటు కావాలంటే అండర్ సెక్షన్ 3 యూజిసి యాక్టు 1956 ప్రకారం (గతంలో 100 ఎకరాలు భూమి, ఇపుడైతే 50 ఎకరాల భూమిలో అనుమతిస్తున్నారు అదీ పది కాలేజీలు, ఆచార్యుల క్వార్టర్స్, విద్యార్ధుల హాస్టల్స్, క్రీడామైదానం, ల్యాబులు, పరిశోధన ప్రదేశాలు, జువాలజీ గార్డెన్) ఉండాలి. అదీ సదరు భూమిలో ఎలాంటి ఆక్రమణలు, లిటికెంటులు ఉండటానికి వీల్లేదు. అలాంటి క్లీన్ చిట్ వున్నభూమి ఉందని, ప్రభుత్వ యూనివర్శిటీలతో పాటు ప్రైవేటు యూనిర్శిటీల అవసరం ఉందని సదరు విద్యాసంస్థను యూనివర్శిటీ మార్పుచేయడానికి తొలుత మంత్రి మండలిలో ఆమోదం తెలిపిన తరువాత ఏపి లెజిస్లేచర్(శాసన సభ)లో బిల్లు పాస్ చేయడానికి ప్రవేశపెడతారు, పాసైన బిల్లుతోపాటు, ప్రైవేటు యూనివర్శిటీ ఏర్పాటు చేయబోయే సంస్థ యొక్క ఫైలుపై అన్నీ సక్రమంగా ఉన్నాయని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సంతకం చేస్తారు. వాటిని యూజిసికి అనుమతి కోసం పంపుతుతారు. నేరుగా ప్రభుత్వం ఆమోందించిన ఫైలును పరిశీలించిన యూజీసి ప్రతిపాదిత విద్యాసంస్థలను ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీలుగా మార్చుకునేందుకు అనుమతి ఇస్తుంది. సరిగ్గా ఇపుడు అదే విధానాన్ని అవలంభించి భూ దురాక్రమిత ప్రైవేటు గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ విషయంలో కూడా ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపి, గీతం రద్దు బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. అంటే ముల్లుని ముల్లుతోనే తీయాలని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలోని రుషికొండ ప్రాంతంలో సుమారు 40.50 ఎకరాల ప్రభుత్వ భూమిని దురాక్రమించిన గీతం తన విద్యాసంస్థలను ప్రైవేటు డీమ్డ్ యూనివర్శిటీగా(13.08.2007)న మార్చుకుంది విద్యాసంస్థల యాజమాన్యం. అటు యూజిసికి, ఇటు ఎన్ఎంసీకి, ఏఐసిటిఈకి, నేక్ కి ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరీ, తమ భూములుగా చూపించి అన్ని రకాల అనుమతులు పొందిన గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీపై అదే లెజిస్లేచర్ లో రద్దు బిల్లు పెట్టడం ద్వారా యూనివర్శిటీ గుర్తింపును రద్దు చేయడానికి అవకాశం వున్నందున ఆ విధానాన్ని పాటించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే అక్రమాస్తులతో గుర్తింపులు తెచ్చుకొని అటు కేంద్రంప్రభుత్వ సంస్థలను, ఇటు విద్యార్ధుల భవిష్యత్తుతో వ్యాపారం సాగించిందనే సాంకేతిక అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి గీతం అవినీతిని విధాన సభ ముందు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం. అంటే ఈరకంగా.. గీతం విద్యాసంస్థలతోపాటు ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు పెట్టే సమయానాకి ఏ ప్రభుత్వం లెజిస్లేచర్ లో బిల్లు పెట్టింది, ఎలాంటి మినిట్స్ తో బిల్లు పెట్టింది, బిల్లు పెట్టే సమయానికి గీతం విద్యాసంస్థలును యూనివర్శిటీగా మార్చుకోవడానికి ఎన్ని ఎకరాల సొంత భూమిని అనుమతులకోసం చూపించారు, చూపిస్తే ఆ భూమి ఏ సర్వేనెంబర్లలో చూపించారు, ప్రస్తుతం గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీ ఎన్ని ఎకరాల భూమిలో విస్తరించి వుంది, తదితర వివరాలన్నీ తీసుకొని, ఆపై ఇటీవల ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూమి వివరాలతో ఒక ప్రత్యేక ఫైలుతో ప్రైవేటు బిల్లు తయారు చేసి, దానిని లెజిస్లేచర్ లో రద్దు బిల్లును ఆమోదించి, ఆపై అదే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కూడా యూజిసికి ఫిర్యాదు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అంటే ఏదైతే లేని భూమిని ఉన్నట్టుగా చూపి అనుమతులు పొందిందో...అవే భూములు గీతంవి కావని, దురాక్రమించినవని ప్రభుత్వం అసెంబ్లీలో కూడా రుజువు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. తమవికాని చూపించినపుడు యూజిసి యూనివర్శిటీగా అనుతించినపుడు, చూపించిన భూముల్లో అగ్రభాగం ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు రుజువైన సమయంలో యూజిసి గీతం కి ఇచ్చిన గుర్తింపుని రద్దు చేయాల్సి వుంది. ఒక్కసారి ఏపీ లెజిస్లేచర్ లో ప్రైవేటు యూనిర్శిటీల రద్దు బిల్లు పాసైతే మళ్లీ గీతం అనుకూలిత ప్రభుత్వం వచ్చేవరకూ గీతంకు యూజిసి అనుమతులు గాలిలో ఉండాల్సిందేనని విద్యావేత్తలు చెబుతున్నారు. అదీ అప్పటికి సదరు యూనివర్శిటీకి సొంత భూములుంటే...ఇపుడు ఆ పరిస్థితి లేదు. ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మిగిలిన ఆక్రమిత భూముల్లో పక్కానిర్మాణాలు చేసింది వాటిని స్వాధీనం చేసుకునే సమయంలో గీతం కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుంది. గీతం యూజిసిని కూడా విద్యార్ధుల భవిష్యత్తు డ్రామాతో మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుందనే సమాచారంతో ప్రభుత్వం యూనివర్శిటీల ఏర్పాటు బిల్లు ద్వారానే రద్దు బిల్లు కూడా పెట్టి గీతంకి చరమగీతం పాడటానికి పక్కాగా ఆధారాలు సేకరిస్తుందని సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే యూజిసి గీతంని వెనుకేసుకు వచ్చినా...ఇటు లెజిస్లేచర్, అటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ద్వారా ఆ బిల్లు రద్దు అయితే గీతం డీమ్డ్ టుబీ యూనివర్శిటీకి యూజితోపాటు, ఏఐసిటిఇ, ఎన్ఎంసీ, నాక్ గుర్తింపులన్నీ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏంజరుగుతుందనేది భూ దురాక్రమిత గీతం తెరపై చూడాల్సిందే..!