విశాఖ స్మార్ట్ సిటీకి మరో జాతీయస్థాయి గుర్తింపు..


Ens Balu
5
ఆర్కేబీచ్
2020-11-19 17:39:16

స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖ మహా నగరానికి  జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌-2020లో విశాఖ స్మార్ట్ సిటి ప్రపంచ నగరాలతో పోటీ మరీ ఆ గుర్తింపు సాధించుకుంది. ఆర్కే బీచ్ లో  దివ్యాంగుల పిల్లలు ఆడుకోవడం కోసం ఏర్పాటు చేసిన పార్కు వినూత్నంగా ఉండటంతో లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు కేటిగిరిలో మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ సక్సస్‌పుల్‌ ప్రాజెక్టుగా దీనిని గుర్తించారు. విశాఖ బీచ్‌రోడ్డులోని రూ.3.50 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేశారు. పార్కులో క్లైంబింగ్‌నెట్‌, పిల్లలు ఆడుకునే ఎక్వప్‌మెంట్‌, పిష్‌డాక్‌, మ్యూజికల్‌ పోల్స్‌, ప్రత్యేక విద్యుత్‌ దీపాలంకరణతో తీర్చిదిద్దే ల్యాండ్‌ స్కేప్‌లు ఎంతో చక్కగా వుంటాయి. ప్రస్తుతం ఈ పార్కు ఆర్కే బీచ్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా కూడా అతి తక్కువ కాలంలో నిలిచింది. దేశంలో రూపొందించిన తొలి ఎబిలిటి పార్కు ఇదే కావడం కూడా మరో విశేషం. ఆశక్తికర విషయం ఏమంటే ఈ పార్కు ఏర్పాటును చూసి యూకే, అమెరికన్ల అంబాసిడర్లు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఈ అవార్డు లభించడపై గ్రేటర్‌ కమిషనర్‌ డా.స్రిజన మాట్లాడుతూ.. ఇదే స్పూర్తితో వచ్చే ఏడాది తొలి స్థానం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రస్తుతం విశాఖ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఎన్నో అభివ్రుద్ధి పనులు చేపడుతున్నామని అవన్నీ పూర్తయితే విశాఖ మహానగరం మరింత సుందరంగా ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తుందని చెప్పారు.