ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ ఇపుడు చాలా సులువు..


Ens Balu
2
New Delhi
2020-11-20 13:08:44

భారత దేశంలో ఇపుడు ప్రతీ పనికి అవసరమయ్యేది ముందుగా ఆధార్ కార్డు మాత్రమే.. ప్రతి ఒక్కరూ దగ్గర తప్పకుండా ఉండాల్సిన గుర్తింపు కార్డ్ కూడా ఇదే. చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే వృద్దుల వరకు ప్రతి చిన్న విషయంలో దీని యొక్క అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం దీనిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాల్సిన సమయం ఆశన్నమైంది. కానీ కొన్నిసార్లు మన అజాగ్రత్త వల్ల లేక మరే ఇతర కారణాల వల్ల మనం ఈ ఆధార్ కార్డు పోగొట్టుకుంటే బాధపడాల్సిన అవసరం ఇకపై లేదని చెబుతోంది కేంద్రప్రభుత్వ సంస్థ ఉడాయ్. ఎందుకంటే మనకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఈ-ఆధార్ రూపంలోనో, ఆధార్ లెటర్, ఆధార్ పీవీసీ కార్డు రూపంలోనో పొందవచ్చు. దీనిని పొందటానికి చాలా రకాల పద్దతులున్నాయి. కానీ అన్నింటికంటే తేలికైన పద్దతి మీ ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్ కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవడం. ఇది ఇపుడు చాలా పాపులర్ అయ్యింది. దీనికోసం ఏం చేయాలో ఇపుడు చూద్దాం.. ముందుగా ఆధార్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకోవడం కోసం  మనం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేసుకోవాలి. తరువాత హోమ్ పేజీలో "గెట్ ఆధార్ కార్డు' సెక్షన్‌లో డౌన్‌డౌన్‌ పైన క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ వెంటనే మొదట మీ ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి 'గెట్ ఓటీపీ' పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత పేస్ ఆథెంటికేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆథెంటికేషన్ ప్రాసెస్‌లో మీ ఫేస్‌ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. "యూఐడీఏఐ" మీ ఫోటో క్లిక్ చేసిన తర్వాత ఒకే పైన క్లిక్ చేయండి. మీ ఫోటో వెరిఫై అయిన తర్వాత ఆధార్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. దీని కోసం మనం ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. చాలా సులువుగా ఎక్కడైనా దీనిని మనం డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొన్ని అధీక్రుత కేంద్రాల్లో పీవీసి కార్డులు కూడా పొందే అవకాశం కూడా వుంది. సో ఎపుడైనా ఆధార్ కార్డు పోయిందనే బెంగ వదిలేసి ఒక్క పదినిమిషాలు నెట్ ముందు కూర్చుంటే మీ ఆధార్ కార్డు మీ దగ్గర వుంటుంది. ప్రతీఒక్కరూ ఆధార్ కార్డు ఫోటో, పీడీఎఫ్, ఫార్మాట్ మొబైల్ ఫోనులో ఉంచుకోవడం ద్వారా ఎపుడైనా అవసరం అనుకుంటే తక్షణమే దానిని ప్రింట్ తీసుకొని ఇవ్వడానికి ఎంతో వీలుగా వుంటుంది..