శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠాధిపతి..


Ens Balu
2
Tirupati
2020-12-14 21:52:11

కర్ణాటక రాష్ట్రంలో ప్రముఖ ద్వైత సంస్థానంగా పేరుగాంచిన  వ్యాసరాజ మఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ సోమ‌వారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామిజీ ముందుగా పాత అన్నదాన భవనం వద్ద గల రావిచెట్టు వద్దకు  చేరుకున్నారు. టిటిడి అర్చకస్వాములు, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్ రెడ్డి, అద‌న‌పు ఈవో  అద‌న‌పు ఈవో ఎ.వి.ధ‌ర్మారెడ్డి‌ ఇస్తికఫాల్‌ స్వాగతం పలికి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి దర్శనం చేయించారు. అక్కడ శఠారి సమర్పించి మేళతాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి తీసుకెళ్లి దర్శనం చేయించి, తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీ వ్యాసరాజ మఠానికి 41వ మఠాధిపతిగా శ్రీశ్రీశ్రీ విద్యాశ్రీషతీర్థుల స్వామీజీ కొనసాగుతున్నారు. 8 శతాబ్దాలకు పైగా చరిత్ర గల ఈ మఠం వ్యవస్థాపకులు శ్రీమద్‌ ఆనందతీర్థ భగవత్పాదులవారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు  గోవింద‌హ‌రి,  డి.పి.ఆనంత, శ్రీవారి డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాథ్‌, విజివో బాలిరెడ్డి, ఒఎస్‌డి పాల శేషాద్రి, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.