ఉక్కులో భారీ కోక్ ఒవెన్ బ్యాటరీ ప్రారంభం


Ens Balu
2
విశాఖపట్నం
2020-12-22 18:44:43

విశాఖ ఉక్కులో రూ.2500 కోట్ల తో నిర్మాణమైన  కోక్ ఒవెన్ బ్యాటరీ -5 ప్రారంభం ఒక చారిత్రక అంశమని స్టీల్ సీఎండీ పీకే రథ్ పేర్కొన్నారు. మంగళవారం ఉక్కులోని నిర్మాణమైన బ్యాటరీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారంలో ఉద్యోగుల అవిశ్రాంత శ్రమతోనే ఈ ప్రాజెక్టు విజయవంతంగా ప్రారంభమైనందని అన్నారు. ఈరోజే కోల్ తో మొదటిసారిగా చార్జు చేయడం కూడా శుభపరిణామమన్నారు. ప్లాంటులోని 76 ఒవెన్లు 24గంటలలోపే చార్జ్ చేసే అవకాశం దీని ద్వారా ఏర్పడిందని చెప్పారు. ఈప్రాజెక్టును బిఈసి కన్సారియం, మిసర్స్ టాటా ప్రాజెక్టు సంయుక్తంగా సకాంలో రూపొందించిందన్నారు. ఈ బ్యాటరీ మొదటి కోక్ పుషింగ్ కార్యక్రమంలో మొకాన్ సీఎండీ అతుల్ భట్, స్టీల్ డైరెక్టర్లు, సీనియర్ అధికారులు, ట్రేడ్ యూనియన్ నాయకులు అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.