రిపబ్లిక్‌డే పరేడ్‌కు ఏయూ విద్యార్థులు..
Ens Balu
1
Visakhapatnam
2020-12-24 18:32:56
ఆంధ్రవిశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వీరికి వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి గురువారం తన కార్యాలయంలో అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది విద్యార్థులను ఎంపిక చేయగా వీరిలో 5గురు ఏయూ విద్యార్థులు కావడం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఏయూ విద్యార్థులు ఎంపిక కావడం వర్సిటీ ప్రతిష్టను ఇనుమడింప చేయడమన్నారు. ఇటువంటి అవకాశాలు విద్యార్థి జీవితంలో అరుదుగా వస్తాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఎంపికైన విద్యార్థులు...
రెండు దశల్లో జరిగిన ఎంపికల్లో ఏయూ పరిధిలో 5గురు విద్యార్థులు ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా 200 మంది వలంటీర్లను రిపబ్లిక్‌డే పరేడ్‌లో పాల్గొనడానికి ఎంపిక చేశారు. వీరిలో మన రాష్ట్రం మెత్తం నుంచి 10 మంది ఎంపిక కాగా, ఏయూ నుంచి 5 వలంటీర్లు ఎంపికయ్యారు. డి.యువరాజు, బి.అనీల్ కుమార్, బి.గాయత్రి తుషార, బూసి ఏంజిలీనా, మేరుగు భావనలు ఎంపికయ్యారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, ఏయూఎన్‌ఎస్‌ఎస్ సమన్వయకర్త డాక్టర్ ఎస్.హరనాథ్, ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర ఇటిఐ కేంద్రం సంచాలకులు డాక్టర్ పి.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.