టిటిడికి రూ.2.54 కోట్లు విరాళం..


Ens Balu
3
Tirumala
2020-12-25 18:31:23

వైకుంఠ ఏకాద‌శి రోజు తిరుమల తిరుపతి దేవస్థానాని కి రూ.2.54 కోట్లు విరాళంగా అందాయి.  ఈ మేరకు శుక్ర‌వారం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు కుమార‌గురు త‌న సొంత ప్రాంత‌మైన త‌మిళ‌నాడు రాష్ట్రం ఊలందూరుపేట‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌య నిర్మాణం కోసం  ఒక కోటి రూపాయ‌లు విరాళంగా అందించారు. అదేవిధంగా, హైద‌రాబాద్‌కు చెందిన  ఇంద్ర‌కుమార్ అనే భ‌క్తుడు టిటిడి విద్యాదాన ట్ర‌స్టుకు రూ.1.08 కోట్లు, ప్రాణ‌దాన ట్ర‌స్టుకు రూ.54 ల‌క్ష‌లు విరాళంగా అందించారు. ఈ మేర‌కు దాత‌లు విరాళాల డిడిల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి ఛైర్మ‌న్  వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డికి అంద‌జేశారు.