శ్రీవారిని దర్శించుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి..
Ens Balu
2
Tirumala
2020-12-25 19:55:01
భారత ప్రధాన న్యాయమూర్తి శరద్ అర్వింద్ బాబ్డే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం తిరుమల శ్రీవారిని ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న బాబ్డే కి టిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఆలయంలో టిటిడి ఛైర్మన్ వైవి.సుబ్బారెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం బాబ్డే వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. జిల్లా జడ్జి రవీంద్రబాబు, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.