సుపరిపాలకు ఈ-సంపద యాప్ దోహదం..
Ens Balu
2
New Delhi
2020-12-25 20:32:52
దేశంలో సుపరిపాలనా ప్రక్రియకు ప్రోత్సాహం అందించడంలో గణనీయమైన ముందడుగు పడుతున్నాయని కేంద్రమంత్రి హర్ దీప్ ఎస్. పూరి అన్నారు. శుక్రవారం డిల్లీలో ఈ సందపద యాప్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వసతుల కేటాయింపు, క్రమబద్ధీకరణ, నో డ్యూస్ సర్టిఫికెట్ల జారీ వంటి ఎస్టేట్ సంబంధమైన సేవలను అందించడంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించేందుకు యాప్ దోహదపడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన సరళతరమైన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ-సంపద యాప్ ను రూపొందించినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు సౌకర్యంగా ఉండేలా తగిన సేవలందించేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుందన్నారు. అప్లికేషన్లను అధికారులు ఎప్పటికప్పుడు నేరుగా ట్రాక్ చేసుకునేందుకు ఏక గవాక్ష సదుపాయంగా ఇది పయోగపడుతుందన్నారు. దీనితో వనరులను గరిష్టస్థాయిలో వినియోగించుకునేందుకు వీలుంటుందని, మానవ ప్రమేయం ఎక్కువగా లేనందున ఇది మరింత పారదర్శకతకు కూడా దోహదపడుతుందని అన్నారు.
మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా మాట్లాడుతూ, వినియోగదారుల సదుపాయంకోసం అనేక ప్రత్యేక ఆకర్షణలు, సదుపాయాలతో ఈ-సంపద యాప్ రూపొందిందన్నారు. పర్సనలైజ్డ్ డ్యాష్ బోర్డు, సర్వీసు యూసేజ్ ఆర్కివ్, లైసెన్స్ ఫీజు, బకాయిలు వంటి అంశాలపై వాస్తవ పరిస్థితిని తెలియజెప్పే సదుపాయం కలిగి ఉండటం ఈ యాప్ ప్రత్యేకతలని అన్నారు. ఇది వినియోగదారులకు ఎంతో అనువుగా ఉంటుంది, తమకు అందే సేవలను ప్రత్యక్షంగా చూసే సదుపాయం, తమ స్పందనను కూడా తెలియజేసే సదుపాయం కూడా ఉంటుందన్నారు. ఫిర్యాదులు దాఖలుకు, పత్రాలు సమర్పణకు, వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరు కావడానికి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆన్ లైన్ సదుపాయంగా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఏ సేవకైనా ఎస్టేట్ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ఎక్కువసార్లు వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అసరం లేకుండా ఈ యాప్ ను ఉపయోగించుకోవచ్చునని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.