ఇళ్ల నిర్మాణాలకు ఆధునిక టెక్నాలజీ..మోదీ


Ens Balu
2
Visakhapatnam
2021-01-01 19:06:16

ప్రపంచంలోని  వివిద దేశాల నుండి ఆధునిక టెక్నాలజీని సమకూర్చుకుని ఇక్కడి అవసరాలకు పరిస్థితులకు అనుకూలంగా మలచుకోవాలని  ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి విడియో కాన్ఫరెన్సు ద్వారా పిఎంఎవై (అర్బన్) మరియు ఆశా ఇండియా అవార్డులను   అందజేశారు మరియు ప్రధానమంత్రి గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీస్ ఛాలెంజ్ కార్యక్రమంలో వివిధ రాప్ట్రాలలో ఆరు లైట్  హౌస్ ప్రాజెక్టులకు శంకుస్థాపన గావించారు.  ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్సులో పిఎం నరేంద్ర మోడీ మాట్లాడుతూ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పేద, మధ్య తరగతి వర్గాలకు మన్నికైన, నాణ్యమైన ఇళ్లను తక్కువ ఖర్చుతో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం పాధాన్యత ఇస్తుందని తెలిపారు. గృహ నిర్మాణ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తుందని, నగరాలలో నివసించే ప్రజల కోసం లక్షల ఇళ్ళను నిర్మిస్తున్నామని తెలిపారు. వలస కార్మికుల కోసం తప్పనిసరిగా నగరాలలో అందుబాటు ధరలో వసతి సౌకర్యం కల్పించాలని కోరారు.   అవార్డులకు సంబంధించి పిఎంఏవై -అర్బన్ ఇళ్ళనిర్మాణం లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3 వ స్థానం లో నిలిచింది. ప్రాజెక్టు మోనిటరింగ్ టూల్స్ మరియు ఇన్నోవేటివ్ కన్ స్ట్రక్షన్ టెక్నాలజీ లకు గాను ఆంధ్రప్రదేశ్  ప్రత్యేక కేటగిరీలో ఎంపిక అయింది. జీవీఎంసీ బెస్ట్ పర్ఫ్మార్మింగ్ మున్సిపల్ కార్పోరేషన్ గా ఎంపికయింది. బెస్ట్ హౌస్ కన్ స్ట్రక్షన్ కేటగిరీలో జిల్లా నుంచి జీవీఎంసీ పరిధిలో గాజువాక 50 వ వార్డు లో నివసించే సత్రబోయిన దుర్గ ఎంపికైనారు. . రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 30.75 లక్షల ఇళ్ళస్థలాల పట్టాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 68,677 ఎకరాల భూమి సేకరించి పంపిణీ చేస్తున్నామని, 16,098 ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ కాలనీలను అభివృద్ధి నిర్మిస్తున్నామని తెలిపారు.రూ. 1400 కోట్లతో ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.  పిఎంఏవై (అర్బన్) కింద 20.21 లక్షల ఇళ్ళను రాష్ట్రానికి కేటాయించారని అన్నారు. విశాఖపట్నం నుంచి జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్, జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, అవార్డు గ్రహీత సత్రబోయిన దుర్గ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నుంచి అవార్డు పొందటం జిల్లా కు గర్వకారణమన్నారు. పిఎంఏవై పథకం నుంచి లబ్ధి పొంది, తన పాత పూరి గుడిసె స్థానంలో సొంతంగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుని గాజువాక కు చెందిన సత్రబోయిన దుర్గ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమీషనర్ జి.సృజన, హౌసింగ్ పిడి శ్రీనివాస్, యూసిడి పిడి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.