ఎస్వీబీసీకి రూ.50 ల‌క్ష‌ల స్పాన్స‌ర్‌షిప్‌..


Ens Balu
4
Tirumala
2021-01-23 19:06:41

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌లో ఒక సంవ‌త్స‌రం పాటు ధార్మిక‌, భ‌క్తిప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్ర‌సారం చేసేందుకు గాను యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 50 ల‌క్ష‌లా 55 వేల 120 రూపాయ‌లు స్పాన్స‌ర్‌షిప్ అందించింది. బ్యాంకు ఎండి, సిఈవో  రాజ్‌కిర‌ణ్ రాయ్ సూచ‌న‌ల మేర‌కు తిరుప‌తి డిజిఎం  ద‌త్తాత్రేయ వేంక‌టేశ్వ‌ర‌శ‌ర్మ స్పాన్స‌ర్‌షిప్ మొత్తం డిడిని శ‌నివారం తిరుమ‌ల‌లోని క్యాంపు కార్యాల‌యంలో టిటిడి అద‌న‌పు ఈవో మ‌రియు ఎస్వీబీసీ ఎండి ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు. తద్వారా ఇకపై ఎస్వీబీసీ ఛానల్ కు కేవలం స్పాన్పర్ షిప్ కార్యక్రమాలే మాత్రమే స్వీకరిస్తాయని, ప్రకటనలు లేని శ్రీవారి ప్రసారాలు అందించే కార్యక్రమంలో భాగంగా ఎస్వీబీసీ అడుగులు ముందుకు వేస్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో యూనియ‌న్ బ్యాంక్ తిరుప‌తి ఎజిఎం  చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, తిరుమ‌ల శాఖ మేనేజ‌ర్  సాంబ‌శివ‌రావు పాల్గొన్నారు.