వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఫర్ సేల్ అతి త్వరలో..
Ens Balu
3
Visakhapatnam
2021-02-24 14:26:22
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఉద్యమాలు, ఆందోళనలు చేసినా విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటు పరం చేయడానికే కేంద్రం మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తుంది. దానికి కారణం ఒక్కటే స్టీల్ ప్లాంట్ లోని 50శాతం షేర్లన్నీ కేంద్రం ఎప్పుడో అమ్మేసిందనే ప్రచారం జరగడమే. అంటే ఇపుడున్న 50శాతం షేర్లలో ఏ ఒక్క షేర్ అత్యధిక భాగం షేర్లు కొన్నవారు కొనుగోలు చేస్తే జాతికి అంకింతం చేసిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాస్తా...ప్రైవేటు పరం అయిపోతుంది. స్టీలు ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకుండా ఇప్పటి వరకూ తాత్సారం చేసిన కేంద్రం, ఇపుడు స్టీలు ప్లాంట్ తోపాటు అప్పట్లో ప్రజల నుంచి అప్పనంగా తీసుకున్న సుమారు 20వేల ఎకరాల భూమిని కూడా తీసుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఆ ఖాళీభూములపైనే కార్పోరేట్ కంపెనీల కన్నుపడింది. ప్రభుత్వానికి చెందిన ఆ భూములు కొనుగోలు చేయాలంటే కుదరదని తెలుసుకున్న కార్పోరేట్ కంపెనీలు తెలివిగా కేంద్రంలోని పెద్దలను ప్రశన్నం చేసుకొని స్టీల్ షేర్లు ఒక్కొక్కటిగా కొనుగోలు చేస్తూ సుమారు 50శాతం షేర్ల వరకూ కొనుగోలు చేసేశారని చెబుతున్నారు. అలా 50శాతం షేర్లు దాటిన సంస్థ ప్రైవేటు వ్యక్తులకు ఖాయిలా పడుతుందని ప్రజలు గుర్తిస్తారని కేంద్రం, స్టీలు ప్లాంట్ పై కన్నేసిన కార్పోరేట్ గెద్దలు భావిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రం ఒక్ యాజమాన్య హక్కులు మాత్రమే కలిగివుందనే విషయం చాలా మందికి తెలియని విషయంగా వుంది. ఇపుడు నేరుగా కేంద్రం స్టీలు ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయడం ద్వారా దానికున్న భూములను కూడా దారాదత్తం చేసేస్తే.. అక్కడ కొత్తగా ఖర్మాగారాలు పెట్టుకోని జాతీయ నవరత్న హోదా కలిగిలిన జాతి సందను మొత్తం కార్పోరేట్ గెద్దలు తన్నుకు పోవడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ విషయంలో స్టీల్ కార్మిక సంఘాలు ఆది నుంచి నెత్తీ నోరు కొట్టుకుంటున్నా ఏ ఒక్కరు పెద్దగా పట్టించుకోలేదు. నష్టాల పేరుతో వీఆర్ఎస్ లు తీసుకోమని ఒత్తిడి తెచ్చినా గుర్తించలేదు. ఆదిలోనే షేర్ల అమ్మకాలు, ప్లాంటులో ప్రైవేటు కంపెనీల ఏర్పాటును నియంత్రించగలిగితే ఇపుడు స్టీలు ప్లాంట్ అమ్మకానికి వెళ్లేది కాదనేది వారి వాదన. అలా కాకుండా జరిగిన నష్టం అంతా జరిగిపోయిన తరువాత ప్రజా ఉద్యమం అంటూ గొంతెత్తినా దానిని కేంద్రం పెద్దగా పరిగణలోకి తీసుకోవడానికి వీలులేకుండా పోయింది. నాటి ఉద్యమ స్పూర్తితోనే నేడు ఉద్యమం చేయాలని భావిస్తున్నా.. కొన్ని కార్పోరేట్ దుష్టశక్తులు స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రజా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుంది. అదంతా కేవలం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయించే కార్యక్రమంలో భాగంగానే జరుగుతోందని ప్రచారం జరగుతుంది. అలా కాకపోతే నాడు విశాఖ స్టీలు ప్లాంట్ కోసం నివరధికంగా జరిగిన ఆందోళనలు, ఉద్యమాలు ఇపుడు కంటి తుడుపు చర్యగానే ఎందుకు జరుగుతున్నాయనే వాదన కూడా తెరపైకి వస్తుంది. అదే సమయంలో అధికారంలోవున్న కేంద్రప్రభుత్వ పార్టీ బీజేపీ నేతలు మరో కొత్త వాదన తెరమీదకు తీసుకు వస్తున్నారు. ఆర్ కార్డు దారులకు తమ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుందని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. యావత్ స్టీల్ ప్లాంట్ నే కార్పోరేట్ కంపెనీలకు దారాదత్తం చేయాలని భావిస్తున్న కేంద్రం...ఆర్ కార్డు నిర్వాసితులకు ఎలా న్యాయం చేస్తుందో చెప్పాలనే ప్రశ్న బలంగా వినిపిస్తుంది. విశాఖ వేదికగా ఎన్ని ఉద్యమాలు జరిగినా అవి కేంద్రం వరకూ వెళ్లడం లేదు. అలాగని రాష్ట్రప్రభుత్వం ఎంపీలు ఎన్ని లేఖలు రాసినా అవి దేశరాజధానిలో బుట్టదాఖలవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలన్నీ కంటితుడుపు చర్యేనని భావించాల్సి వస్తుంద స్టీలు ప్లాంట్ కోసం ఆలోచించేవారు విశ్లేషకులు భావించాల్సి వస్తుంది.. ఎవరు ఎన్ని అనుకున్నా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సేల్ అయిపోతుందనే విషయం కాస్త బాధగానే ఉన్నప్పటికీ.. నాడు కర్మాగారం కోసం భూములు ఇచ్చిన ఆర్ కార్డుదారుల నోట్లో మట్టి పడేలానే కనిపిస్తుంది. అన్నేళ్లుగా ఆర్ కార్డు దారుల సమస్యలు అధికారంలో ఉన్న ఏ కేంద్ర ప్రభుత్వం గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ పరిష్కరించలేదు. అలాగని అధికారంలో ఉన్నంతసేపూ పరిష్కరిస్తామంటూ ఐదేళ్ల కాలంలో హడావిడి చేయడం తప్పితే వారికి ఏ ప్రభుత్వం ద్వారా కూడా వారికి న్యాయం జరగలేదు. అంటే ఆ కర్మాగారం ప్రైవేటీకరణకు అప్పట్లోనే అంకురార్పణ జరిగిందనే అనుమానాలకు తాజా ఆర్ కార్డు దారులకు జరిగిన అన్యాయమనే సాక్షిగా నిలుస్తుంది. వారికి నేటి వరకూ న్యాయం కుడా జరగలేదు సరికదా ఇప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలే వారికి న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. అన్నీ వెరసి విశాఖ స్టీల్ ప్లాంట్ లో మిగిలివున్న 50శాతం షేర్ల అమ్మకం మొదలైనా, కేంద్రం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోకపోయినా స్టీల్ ప్లాంట్ తోపాటు, ఖాళీగా ఉన్న వేలాది ఎకరాల భూములన్నీ ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా నేటికీ కార్పోరేట్ సంస్థలదే పైచేయిగా నిలుస్తుందనడానికి మరోసారి విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటుపరం అనే అంశం ఒక తాజా చిరస్థాయి ఉదాహరణగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేమూ లేదు..!