తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి..
Ens Balu
3
Tirumala
2021-03-04 22:12:33
భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గురువారం సాయంత్రం 5.15 గంటలకు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహానికి చేరుకున్న ఉప రాష్ట్రపతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతి శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, ఆర్‌డివో కనక నరసారెడ్డి తదితరులు పాల్గొన్నారు.