కుటుంబ వ్యవస్థను కాపాడుకుందాం..


Ens Balu
4
New Delhi
2021-05-15 10:16:46

ఎంతో ప్రాశస్త్యం.. తరతరాల చరిత్ర కలిగిన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలంటూ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని నాయుడు శనివారం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మన సమాజానికి, మన సాంఘిక భద్రత కు మూలాధారం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.  పిల్లలకు కుటుంబంలోని పెద్దల తో అనుబంధం, వారి అనుభవాల సారం ఎంతో అవసరం అన్నారు. పెద్దలకు కూడా పిల్లలతో సమయం గడపడం వల్ల మానసికోల్లాసం లభిస్తుందని, విలువలతో కూడిన ఈ వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులు కావాలని  వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.