ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం..


Ens Balu
4
New Delhi
2021-05-21 10:31:31

నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అనే అనువంశిక ఆయుర్వేద వైద్యుడి కరోనా మందుపై  అధ్యయనం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆయుష్ ఇన్ చార్జ్ మంత్రి కిరణ్ రిజ్జు, ఐ.సి.ఎం.ఆర్. డైరక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచించారు. నెల్లూరు ఆయుర్వేద మందు విషయంలో నెలకొన్న పరిస్థితులు ఉపరాష్ట్రపతి దృష్టికి వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వెంటనే కేంద్ర మంత్రి , డైరక్టర్ జనరల్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. వెంటనే ఆ మందు మీద అధ్యయనం ప్రారంభించి, వీలైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్రం ద్రుష్టికి వెళ్లిన ఆనందయ్య మందుపై ఇప్పటికే మంచి ఫలితాలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతుంది..