శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు బుధవారం సాయంత్రం ఒక కోటి రూపాయలు విరాళంగా అందింది. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్‌వేర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ పిఎస్.జయరాఘవేంద్ర ఈ మేరకు విరాళం అందించారు. డిడిని దాత తరఫున టిటిడి బోర్డు సభ్యులు డిపి.అనంత తిరుమలలోని బంగళాలో టిటిడి అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, స్వామివారి సేవలు ప్రపంచ వ్యాప్తం కావాలని, దేశంలోని అన్ని ప్రధాన భాషల్లోనూ ప్రసారం చేసి అన్ని వర్గాల భక్తులకు చేరువ అయ్యేలా చేయాలని కోరారు. దాతల సూచనల మేరకు టిటిడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు.