జూన్ నెలలో శ్రీవారికి విశేష ఉత్సవాలు..
Ens Balu
2
Tirumala
2021-05-27 16:34:39
తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో జరుగనున్న విశేష ఉత్సవాలకు టిటిడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నరసింహ జయంతి నుండి 10వ రోజైన జూన్ 3న ఉత్తర మాడ వీధిలోని రాతి మండపంలో శ్రీ మలయప్పస్వామివారికి ఆస్థానం వుంటుంది.. జూన్ 4న శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, 7వ మైలు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహం వద్ద హనుమజ్జయంతి వేడుకలు, జూన్ 6న మతత్రయ ఏకాదశి, జూన్ 12న శ్రీ పెరియాళ్వార్ల ఉత్సవారంభం, జూన్ 15న మిథున సంక్రమణం, జూన్ 20న ప్రత్యేక సహస్రకలశాభిషేకం, జూన్ 21న మతత్రయ ఏకాదశి, శ్రీ పెరియాళ్వార్ల శాత్తుమొర, జూన్ 22 నుండి 24వ తేదీ వరకు శ్రీవారి జ్యేష్ఠాభిషేకం, జూన్ 24న ఏరువాక పూర్ణిమ ఉత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమాలన్నీ ఎస్వీబీసీ ఛానల్ లైవ్ ప్రసారాలు అందించనుంది..