సెప్టెంబరు 3న బ్యాంకర్లతో సమావేశం నిర్మలాసీతారామన్
Ens Balu
1
New Delhi
2020-08-30 20:15:57
షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల ఉన్నతాధికారులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ సెప్టెంబరు 3వ తేదీన సమావేశం కానున్నారని పిఎంఓ తెలియజేసింది. బ్యాంకు అప్పుల్లో కొవిడ్ ఒత్తిడికి సంబంధించిన తీర్మాన విధానాల అమలుపై సమీక్షిస్తారని పేర్కొంది. సామర్థ్యం ఆధారంగా వ్యాపారాలు, గృహాలు కొత్త విధానాలు పొందేలా చూడడంతో పాటు బ్యాంక్ విధానాల ఖరారు, రుణగ్రహీతలను గుర్తించడం వంటి ముఖ్య కార్యక్రమాలు, సాఫీగా, వేగంగా అమలు చేయడా నికి అవసరమైన అంశాలపై సమీక్షలో చర్చిస్తారు. కోవిడ్ తీవ్రత తరువాత బ్యాంకు రుణాలపై కేంద్రం మారటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే నెల నుంచి బ్యాంకులు యధావిధిగా లోన్లపై ఈఎంఐలు చెల్లింపులు మొదలు పెట్టాలంటూ వినియోగదారులకు చరవాణి సందేశాలను పంపిస్తున్నాయి. అయితే చాలా బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు మారటోరియం ప్రకటించినా వారి ఈఎంఐలు ఆపకుండా కట్టేస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు కేంద్రం ఆదేశాలు ఏవిధంగా పాటించాయి, తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.