24 గంటల్లో 10.55 లక్షల కోవిడ్ పరీక్షలు చేసిన భారత్
Ens Balu
3
New Delhi
2020-08-30 21:01:16
కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా భారత దేశం కీలక మైలరాయిని దాటింది. తొలిసారిగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 10.5 లక్షల కోవిడ్ పరీక్షలు చేసిందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. గడచిన 24 గంటలలో దేశంలో 10,55,027 కోవిడ్ పరీక్షలు చేశారని, దేశం జాతీయ కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని రోజుకు 10 లక్షలకు మించి చేసేందుకు పరీక్షల వ్యవస్థను తయారు చేసుకుందని పేర్కొంది. కోవిడ్ పరీక్షల విషయంలో సాధించిన ఈ విజయంతో మొత్తం దేశవ్యాప్తంగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల సంఖ్య 4.14 కోట్లు (4,14,61,636) దాటింది. కోవిడ్ -19 కి సంబంధించి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకునని , ప్రభుత్వం, పరీక్షించు, గుర్తించు, చికిత్స అందించు విధానాన్ని అనుసరిస్తోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సన్నిహిత సహకారంతో దీనిని చేపడుతోంది. పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తుండడం వల్ల పాజిటివ్ కేసులు ప్రాథమిక దశలోనే గుర్తించి సకాలంలో తగిన చికిత్స అందించడానికి వీలు కలుగుతోంది. దీనితోపాటు స్వల్ప లక్షణాలు ఉన్న వారిని ఇంటి వద్ద ఐసొలేషనల్‌లో ఉంచడానికి, తీవ్రమైన కేసులను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందించడానికి వీలు కలుగుతోంది. పెద్ద ఎత్తున కోవిడ్ పరీక్షల సామర్ధ్యం పెరగడం, పరీక్షల సంఖ్య పెరగడంతో ప్రతి పదిలక్షలకు నిర్వహించే పరీక్షల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఇది ఈరోజు 30,044 వద్ద ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ , COVID-19 సందర్భంలో ప్రజారోగ్యం, సామాజిక కార్యకలాపాలను సర్దుబాటు చేయడానికి ప్రజారోగ్య ప్రమాణాలు, పేరుతో విడుదల చేసిన సూచన పత్రం కోవిడ్ అనుమానిత కేసులపై సమగ్ర నిఘా ఉంచాలని సూచించింది. పదిలక్షల జనాభాకు రోజుకు 140 పరీక్షలు చేయాలని డబ్ల్యు.హెచ్.ఓ సూచించింది. అయితే అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలూ ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన స్థాయి పరీక్షల సంఖ్యను దాటేశాయన్న కేంద్రం పలు రాష్ట్రాలు జాతీయ సగటు కంటే తక్కువ పాజిటివిటీ రేటు కలిగి మంచి పనితీరు కనబరుస్తున్నాయని చెప్పంది...