రూ.4300 కోట్ల ప్రాజెక్టులకు నితిన్ గట్కరీ శంఖుస్థాపన..


Ens Balu
2
Uttar Pradesh
2020-08-31 18:04:14

ఉత్తర ప్రదేశ్‌లో రూ.4300 కోట్ల విలువైన 11 రహదారి ప్రాజెక్టులకు కేంద్ర ర‌హ‌దారి రవాణా, జాతీయ రహదారులు, ఎంఎస్‌ఎంఈల శాఖ మంత్రి  నితిన్ గడ్కరీ రేపు శంకుస్థాప‌న చేయనున్నారు. వర్చువల్ విధానంలో జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి  యోగి ఆదిత్యనాథ్ అధ్యక్షత వహించనున్నారు. ఆర్‌టీహెచ్ శాఖ స‌హాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వి.కె. సింగ్, యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యతో స‌హా ఆ రాష్ట్ర మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, లు కేంద్రం మరియు రాష్ట్ర ప్ర‌భుత్వాల ఉన్న‌తాధికారులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌నున్నారు. ఈ ర‌హ‌దారుల మొత్తం నిడివి 363 కి.మీ. మేర ఉన్న.. ఈ ర‌హ‌దారుల నిర్మాణ వ్య‌యం రూ.4281 కోట్లు.. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ అభివృద్ధికి మార్గం సుగమం చేస్తూ.. ఈ రహదారులు రాష్ట్రంలో, చుట్టుపక్కల ప్రాంతాల‌తో మెరుగైన కనెక్టివిటీ, సౌలభ్యం కలగనున్నాయి.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రజలు, వస్తువుల ర‌వాణా ఈ ప్రాజెక్టులతో మెరుగుప‌డుతుంది. మ‌రీ ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలతో ర‌వాణా గణనీయంగా మెరుగ‌వుతుందని భావిస్తున్నారు. ఈ నూతన రహదారుల వలన ఇందన పొదుపు కావడంతోపాటు, కాలుష్య కారకాల ఉద్గారాలు కూడా తగ్గుతాయి. ఈ ప్రాజెక్టులో చేప‌ట్టే ప‌నుల‌లో ఇరుకైన రోడ్ల‌ను విస్తార‌ప‌ర‌చ‌డంతో పాటు పట్టణాలను ఎన్‌-రూట్‌లో విడదీసి మెరుగైన రహదారి అనుభూతిని క‌లిగిస్తాయి...