తయారీ రంగ హబ్ గా భారత్...కేంద్ర మంత్రి గట్కరీ


Ens Balu
2
Rajasthan
2020-08-31 18:23:24

భారత దేశం త‌యారీ రంగ హ‌బ్‌గా మారాలంటే నైపుణ్యంగ‌ల ప‌నివారు ఎంతో అవ‌స‌ర‌మని కేంద్ర సూక్ష్మ, చిన్న, మ‌ధ్య‌త‌ర‌హా సంస్థ‌లు, (ఎం.ఎస్‌.ఎం.ఇ‌), రోడ్డు ర‌వా ణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రి  నితిన్‌గ‌డ్క‌రి అన్నారు. సోమవారం రాజ‌స్థాన్‌లోని అల్వార్ జిల్లాలోని భివాడి వ‌ద్ద ఏర్పాటుచేసిన టెక్నాల‌జీ సెంట‌ర్‌ను వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా గట్కరీ మాట్లాడుతూ, త‌యారీ రంగం దేశ జిడిపిలో 22 నుంచి 24 శాతం స‌మ‌కూరుస్తున్న‌ద‌ని, ప్ర‌ధాన‌ మంత్రి ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ పిలుపుమేర‌కు 15 నూత‌న టెక్నాలజీ సెంట‌ర్లు(టిసిలు) ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ప్ర‌స్తుతం ఉన్న 18 టిసిల‌ను నైపుణ్యంగ‌ల సిబ్బం దిని త‌యారు చేసేందు‌కు కొత్త టెక్నాలజీ కేంద్రాలు ఉపకరిస్తాయన్నారు.   ఈ టిసిల‌ విస్త‌ర‌ణ కేంద్రాల‌పై కూడా కృషి చేస్తున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. విస్త‌ర‌ణ కేంద్రాల‌కు అవ‌స‌ర‌మైన భూమి, ఇత‌ర లాజిస్టిక్‌లకు మ‌ద్ద‌తు క‌ల్పించాల్సిందిగా ఆయ‌న రాష్ట్ర‌ప్ర‌భుత్వాల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ విస్త‌ర‌ణ కేంద్రాలు కొత్త ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాలు‌, ప్ర‌స్తుత ప‌రిశ్ర‌మ‌ల అవ‌స‌రాల‌ను తీర్చ‌గ‌ల‌వ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్ర‌స్తుత పాలిటెక్నిక్‌లు, ఐటిఐలు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన‌ మౌలిక‌స‌దుపాయాల‌ను యువ‌త‌కు నైపుణ్యాలు క‌ల్పించేందుకు వినియోగించాల‌ని, ఇందుకు ప‌రిశ్ర‌మల మద్ద‌తు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.  ఎం.ఎస్.ఎం.ఇ , ప‌శుగ‌ణాభివృద్ధి,పాడి ప‌రిశ్ర‌మ‌, మ‌త్స్య‌శాఖ‌ స‌హాయ మంత్రి  ప్ర‌తాప్ చంద్ర సారంగి  మాట్లాడుతూ,  టెక్నాల‌జీ కేంద్రం ఏర్పాటైనందుకు, భివాండి ప్ర‌జ‌ల‌ను, రాజ‌స్థాన్ ప్ర‌జ‌లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. కోవిడ్ -19 కార‌ణంగా దేశం ఆర్ధిక సంక్షోభ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న‌ద‌ని, అలాంటి స‌మయంలో ఈ కేంద్రాలు ఎంతో ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంటాయ‌ని అన్నారు. ఎం.ఎస్‌.ఎం.ఇ కార్య‌ద‌ర్శి ఎ.కె.శ‌ర్మ మాట్లాడుతూ, రానున్న టెక్నాల‌జీ కేంద్రాలు జ‌న‌ర‌ల్ ఇంజనీరింగ్‌, ఆటోమోటివ్, ప‌రిమ‌ళ‌ద్ర‌వ్యాలు, రుచి, ఇఎస్‌డిఎం రంగాల చెందిన‌ ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌హాయ‌ప‌డ‌నున్నాయన్నారు. వీటికి అత్య‌ధునాత‌న త‌యారీ రంగ సాంకేతిక ప‌రిజ్ఞానం, సిఎన్‌సి యంత్రాలు, 3 డి త‌యారీ, అడిటివ్ త‌యారీ, లేజ‌ర్‌, అల్ట్రాసోనిక్ యంత్రాలు ,రోబోటిక్‌లు, ప్రాసెస్ ఆటోమేష‌న్‌, ఖ‌చ్చిత‌మైన కొల‌తలు తీయ‌గ‌ల ప‌రిక‌రాలు‌, మెట్రాల‌జీ ప‌రిక‌రాలు, అధునాత‌న ఎల‌క్ట్రానిక్ త‌యారీ స‌దుపాయాలు, కాలిబ్రేష‌న్‌, ఎల‌క్ట్రానిక్ డిజైనింగ్ కు సంబంధించి అధునాత ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ స‌దుపాయాలు క‌ల్పించ‌నున్న‌ట్టు చెప్పారు. ఎం.ఎస్‌.ఎం. ఇ మంత్రిత్వ‌శాఖ‌ డ‌వ‌ల‌ప్ మెంట్ క‌మిష‌న‌ర్ ద్వారా టెక్నాల‌జీ సెంట‌ర్ సిస్ట‌మ్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్న‌ది.  దీని కింద 15 టెక్నాల‌జీ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌డంతోపాటు ప్ర‌స్తుతం ఉన్న 18 టెక్నాల‌జీ సెంట‌ర్ల స్థాయి పెంచ‌నున్నామన్నారు.