ఆ నాలుగు రాష్ట్రాలకు ప్రత్యేక బ్రుందాలు...


Ens Balu
4
New delhi
2020-08-31 21:59:07

దేశంలో అకస్మాత్తుగా కోవిడ్ 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్టు గమనించిన 4రాష్ట్రాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలను పంపాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాలలో కోవిడ్ కేసుల ఆకస్మిక పెరుగుదలతో పాటు మరణాలసంఖ్య కూడా పెరిగినట్టు కేంద్రం గుర్తించింది. ఈ మేరకు ఈ కేంద్ర బృందాలు కరోనా కట్టడి, నిఘా, పరీక్షలు, చికిత్సలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వాల కృషికి తోడుగా తమవంతు సాయం చేస్తాయి. సకాలంలో పరీక్షలు జరపటం, సత్వరం చికిత్స అందేలా చూడటం లాంటి పనుల్లో సమర్థంగా వ్యవహరించటానికి. ఆ సందర్భంగా ఎదురయ్యే రకరకాల సవాళ్లను ఎదుర్కోవటానికి అక్కడి రాష్ట్రప్రభుత్వాధికారులకు దిశా నిర్ధేశం చేస్తాయి. వివిధ రంగాల నిపుణులతో కూడిన ఈ బృందాలలో ఒక ప్రజారోగ్యనిపుణుడు, ఒక సంక్రమణ రోగాల నిపుణుడు ఉంటారు. ఈ నాలుగు రాష్ట్రాలలోనూ ఉత్తరప్రదేశ్ లో గరిష్ఠంగా 54,666మంది కరోనా బాధితులు ప్రస్తుతం చికిత్సలో ఉండగా ఆ తరువాత మూడు స్థానాల్లో ఒడిశా (27,219), చత్తీస్ గఢ్ (13,520) జార్ఖండ్ (11,577 ) ఉన్నాయి. ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య దృష్ట్యా చూస్తే ఉత్తరప్రదేశ్ లో 2,25,632, ఒడిశాలో 1,00,934, జార్ఖండ్ లో 38,435, చత్తీస్ గఢ్ లో 30,092 కేసులు నమోదయ్యాయి. అధిక సంఖ్యలో 3423 మరణాలు నమోదైంది  కూడా ఉత్తరప్రదేశ్ లోనే. ఒడిశా, జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో482, 410, 269 మరణాలు నమోదయ్యాయి.