ఎస్వీ విద్యాదాన ట్రస్టుకు రూ. కోటి విరాళం
Ens Balu
7
Tirumala
2021-06-18 12:10:32
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కి చెందిన పరమేషు బయోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఎండి తెటాలి ఉపేంద్రరెడ్డి శుక్రవారం టిటిడి శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు విరాళం చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులువైవి.సుబ్బారెడ్డికి కుటుంబ సమేతంగా కలిసి వెళ్లి అందజేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరంచారు.