ఎస్వీబీసీ ట్రస్టుకి రూ.20లక్షలు విరాళం..


Ens Balu
10
Tirumala
2021-06-21 14:04:10

తిరుమలలోని శ్రీవారికి చెందిని ఎస్వీబీసీకి సోమవారం రూ.20లక్షలు విరాళం అందింది. బెంగళూరుకి చెందిన హేమనాథ్ గౌడ ఈ విరాళ చెక్కును  అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డికి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, ఎస్వీబీసీ ద్వారా భక్తులకు శ్రీవారి సేవలు ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలుగుతుందన్నారు. భారతదేశంలోని అన్ని భాషల్లోనూ స్వామిప్రసారాలు అందజేస్తే శ్రీవారిసేవలు అందరికీ చేరువ అవుతాయని అదనపు ఏఈఓను కోరారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.