పార్లమెంటు బిసీ కమిటీలో బెల్లాన..
Ens Balu
6
Vizianagaram
2021-06-22 12:46:24
వెనుకబడిన తరగతుల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ లో విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్ కు చోటు దక్కింది. పార్లమెంట్ సభ్యుడు రాజేష్ వర్మ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ పదవీకాలం ఏడాది పాటు వుంటుంది. 20221-22 సంవత్సరానికి సంబంధించి 20 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో బి.సి. సంక్షేమ పార్లమెంటరీ కమిటీ ని ఏర్పాటు చేస్తూ లోక్ సభ సెక్రెటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన నియామకం పట్ల విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ బిసి విభాగం హర్షం వ్యక్తం చేసింది..