ఒలింపిక్ క్రీడోత్సవాలలో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించిన వారందరిని చూసుకొని దేశ ప్రజలు గర్వపడుతున్నారని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒలింపిక్ క్రీడల దినోత్సవం సందర్భంగా టోక్యో ఒలింపిక్ క్రీడల లో పాలుపంచుకోనున్న భారతీయ క్రీడాకారుల కు, భారతీయ క్రీడాకారిణుల కు అంతా మంచే జరగాలని ఆయన అభిలషించారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఒలింపిక్స్ లో భారతదేశాని కి ప్రాతినిధ్యం వహించిన అందరిని నేను అభినందిస్తున్నాను. టోక్యోలో జరగనున్న క్రీడల్లో మన దేశాని కి చెందిన క్రీడాకారులు అందులో అత్యుత్తమ ఫలితాల ను సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.