ఎస్వీబీసీ ట్రస్టుకి రూ. కోటి విరాళం..


Ens Balu
3
Tirumala
2021-06-26 05:47:57

తిరుమల లోని ఎస్వీబీసీ ట్రస్టుకి శనివారం కోటి రూపాయల భారీ విరాళం అందింది. కర్ణాటకు చెందిన కురుగోడు మాజీ ఎమ్మెల్యే ఎన్.సూర్యనారాయణ రెడ్డి ఈ మొత్తం యొక్క చెక్కును అదనపు ఈఓ ఏవి ధర్మారెడ్డికి కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, శ్రీవారి సేవలను దేశంలోని ప్రముఖ భాషల్లో ప్రసారాలు అందించడం ద్వారా స్వామిసేవలు అందరికీ చేరువ అవుతాయన్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టిటిడి అధికారులు పాల్గొన్నారు.