వైద్య రంగానికి అధికంగా నిధులు..
Ens Balu
7
New Delhi
2021-07-01 15:12:56
కొవిడ్-19 విపత్తు వేళ దేశ వ్యాప్తంగా నిశ్వార్ధంగా సేవలందించిన వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు రాత్రింబవళ్లు శ్రమించారని..దానిని జాతి గుర్తుంచుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి బడ్జెట్ కేటాయింపులను రెట్టింపు చేశామని చెప్పిన మోడీ ఆరోగ్య మౌలిక సౌకర్యాల కల్పనకు కేంద్రం తోడ్పాటు ఇస్తుందని వివరించారు. ఆరోగ్య మౌలిక సౌకర్యాలకు రూ.50వేల కోట్ల రుణ హామీ పథకం తెచ్చినట్లు తెలిపారు. వైద్యులపై దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇతర దేశాలతో పోలిస్తే వైద్యరంగంలో భారత్ మెరుగ్గానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు.