తిరుమల శ్రీవారికి మంగళవారం కొప్పెర హుండీ విరాళంగా అందింది. తిరుపతి సమీపంలోని కొప్పెరవాండ్లపల్లెకు చెందిన కొప్పెర సాయిసురేష్, కొప్పెర కుమార్ ఈ మేరకు హుండీని ఆలయంలో పేష్కార్ శ్రీహరికి అందించారు. రాగి, ఇత్తడితో కలిపి తయారుచేసిన ఈ హుండీ బరువు 60 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.1.50 లక్షలని దాతలు తెలిపారు. తాము 200 ఏళ్లుగా వంశపారంపర్యంగా స్వామివారికి కొప్పెర హుండీలు సమర్పిస్తున్నామని దాతలు వెల్లడించారు.