తిరుమలలో రక్షణ ఏర్పాట్లు పరిశీలన..
Ens Balu
10
Tirumala
2021-07-28 15:08:05
తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రెండో దశలో చేపడుతున్న బాహ్యవలయ(ఔటర్ కార్డన్) రక్షణ ఏర్పాట్లను సివిఎస్వో గోపినాథ్ జెట్టి బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా టిటిడి ఇదివరకే మొదటి దశలో రక్షణ ఏర్పాట్లను పూర్తి చేసింది. భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా రెండో దశ బాహ్యవలయ పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. సివిఎస్వో వెంట టిటిడి చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఇఇ-1 జగన్‌మోహన్‌రెడ్డి, ఎవిఎస్వోలు గంగరాజు, పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.