ఇక పాత వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి...


Ens Balu
3
New Delhi
2020-09-04 11:40:08

కేంద్రం డిజిటల్ చెల్లింపులను మరింత పెంచేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లించే విధానాన్ని పూర్తిగా రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.  డిజిటల్, ఐటీ ఆధారిత టోల్‌ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే దిశగా 2017 డిసెంబర్‌ 1కి ముందు విక్రయించిన వాహనాలన్నింటికీ ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఫాస్టాగ్‌ మొదలైన తర్వాత కూడా ఇంకా 40 శాతం మంది వాహనదారులు టోల్‌ ఫీజును నగదు రూపంలో చెల్లిస్తున్నట్టు గుర్తించిన కేంద్రం 2021 జనవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలని యోచిస్తోంది. అంటే పాత వాహనాలకు కూడా ఇక నుంచి ఫాస్టాగ్ అమలు జరుగుతుంది. తద్వారా డిజిడిట్ చెల్లింపులు టోల్ ప్లాజాలో శతశాతం జరుగుతాయని ప్రభుత్వం భావింస్తుంది. ఈ మేరకు సెంట్రల్‌ మోటర్‌ వెహికల్స్‌ నిబంధనలకు రహదారి రవాణా శాఖ సవరణలు ప్రతిపాదించి సంబంధిత వర్గాల అభిప్రాయాలను కోరుతూ ముసాయిదా నోటిఫికేషన్‌ జారీ చేసింది..తద్వారా అనుకున్న లక్ష్యాన్ని కేంద్రం పూర్తిచేయనుంది.