ఏం జరిగినా సమరానికి సిద్ధం...కానీ
Ens Balu
3
Ladakh
2020-09-04 13:27:46
తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే స్పష్టం చేశారు..అయినా పర్వాలేదు ప్రపంచంలోనే మన సైనిక సంపత అత్యుత్తమంగా ఉంది...ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. లద్దాఖ్‌లోని సరిహద్దుల వెంబడి భారత్, చైనా మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతల పై స్పందించిన నరవణే ఈ విధంగా చెప్పారు. ‘‘దేశ భద్రత కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకవేళ చైనా ఎలాంటి దుస్సాహసానికి దిగినా సరిహద్దును కాపాడుకునేలా పటిష్ఠంగా వ్యూహాన్ని సిద్ధం చేశా అన్నారు ’’ చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నామన్న ఆర్మీచీఫ్ ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాంమని, అలాకాకుండా ఏం చేసినా, దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు సైన్యం సిద్ధంగా ఉందిని భరోసా ఇచ్చారు. నరవణే వ్యాఖ్యలు అటు సైనికుల్లోనూ, ఇటు దేశ ప్రజల్లోనూ కొండంత ధైర్యాన్ని నింపినట్టు అయ్యింది...