ప్రభుత్వ కరోనా లెక్కలపై తెలంగాణ హైకోర్టు సీరియస్...


Ens Balu
2
Hyderabad
2020-09-04 15:42:57

తెలంగాణలో కరోనా పరిస్థితులు, పరీక్షలు, చికిత్సలపై హైకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న బులిటెన్లకి, జరుగుతున్న మరణాలకు చాలా వ్యత్యాసం వుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం హైకోర్టులో కరోనా పరిస్థితులపై జరిగిన విచారణ లో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. ‘‘ప్రభుత్వ నివేదిక నిర్లక్ష్యంగా, అస్పష్టంగా ఉంది. జిల్లాల్లో కరోనా వైద్య సదుపాయాలు పెంచాలి. కరోనా మృతుల సంఖ్యపై వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోంది. కేసులు పెరుగుతున్నా.. మృతుల సంఖ్య 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉంది. అని పేర్కొంది.  మృతుల సంఖ్యపై వాస్తవ వివరాలు వెల్లడించాలన్న హైకోర్టు జిల్లా స్థాయి బులిటెన్లపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారు. ఆగస్టు 31 నుంచి ఈనెల 4వరకు జిల్లా బులిటెన్లు ఇవ్వాలి’’ అని  రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.